వైద్య సిబ్బందికి గ్రామ ప్రజలు సహకరించాలి

ABN , First Publish Date - 2022-08-27T04:11:06+05:30 IST

వైద్య సిబ్బందికి గ్రామ ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాధికా రి రవిశంకర్‌ అన్నారు.

వైద్య సిబ్బందికి  గ్రామ ప్రజలు సహకరించాలి
మద్దిగట్లలో ఇంటింటికి తిరిగి ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా వైద్యాధికారి

-  పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

- వనపర్తి జిల్లా వైద్య అధికారి రవిశంకర్‌

పెద్దమందడి, ఆగస్టు 26 : వైద్య సిబ్బందికి గ్రామ ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాధికా రి రవిశంకర్‌ అన్నారు. మద్దిగట్ల గ్రామంలో వైద్య సిబ్బందితో కలిసి ఆయన శుక్రవారం పర్యటిం చారు. ఇంటింటికి తిరిగి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విషజ్వరాలు వచ్చిన వారికి  సూచనలు చేశారు. ప్రతీ రోజు వేడి చేసిన నీరు తాగాలని, ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. ఇంటి పరిసరాల పరి శుభ్రంగా  ఉంచుకోవాలన్నారు.  డ్రైనేజి కాలువల వెంట బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలని, వర్షాకాలం సీజన్‌ ఉండడం వలన మనం జాగ్రత్తగా ఉండా లని అన్నారు. గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్‌ ఎంలు వ్యాధి సోకిన వారి ఇంటికి వెళ్లి వారికి వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్య క్రమంలో రామస్వామి, లక్ష్మణ్‌, బషీర్‌, ఉత్తమ్మ, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో..

ఆత్మకూర్‌ : సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆయూబ్‌ ఖాన్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. మండ లంలోని బాలకృష్ణాపూర్‌లో శుక్రవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉన్న కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల వ్యాధుల బారినపడే అవకాశం ఉందని, కావున ప్రతీ ఒక్కరు పరిసరాల శుభ్రత తో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిం చారు. అలాగే గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌, అబౌట్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు.  కార్యక్రమం లో హెల్త్‌ సూపర్‌వైజర్‌ సురేందర్‌ గౌడ్‌, సామ్రా జ్య లక్ష్మి, ఏఎన్‌ఎం నాగలక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-27T04:11:06+05:30 IST