Abn logo
Apr 19 2021 @ 00:31AM

విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక సంఘాన్ని బలోపేతం చేయాలి

రామగిరి, ఏప్రిల్‌ 18 : విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక సంఘం అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని వేదాస్‌ జిల్లా అధ్యక్షుడు దాసోజు బ్రహ్మచారి కోరారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ వేదిక సంఘం నూతన మండల కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వనతి గృహంలో ఆదివారం నిర్వహించా రు. ఈ సందర్భంగా వేదాస్‌ జిల్లా అధ్యక్షుడు దాసోజు బ్రహ్మచారి నూతనంగా ఏర్పాటైన మండల కమిటీ అధ్యక్షుడు కన్నెకంటి శ్రీనివాసచారి ప్రధాన కార్యదర్శి చొక్కల మధు, కోశాధికారి ఇటికాల రాజబాబు, ఉపాధ్యక్షుడు తాడూరి చలమయ్య, కొల్లోజు శ్రీనివాసచారి, కంచనపల్లి చంద్రశేఖరాచారితో పాటు మరికొంత మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు యాదయ్య, ప్రధాన కార్యదర్శి సోల్లేటి లక్ష్మణ్‌, కోశాధికారి సోల్లేటి కృష్ణకుమార్‌, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్యం వెంకటాచారి, మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనా థం, నాయకులు కన్నెగంటి సత్యనారయణ, సోల్లేటి రమేష్‌, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement