Abn logo
Apr 19 2021 @ 00:39AM

జిల్లాను అగ్రస్థానంలో నిలిపేది వలంటీర్లే

వలంటీర్లకు వందనం కార్యక్రమంలో కలెక్టర్‌

దేశమంతా వలంటీర్ల వ్యవస్థను కొనియాడుతోంది : ఎంపీ  రంగయ్య

బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌18 : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ ఒక సైన్యం లాంటిదని, జిల్లాను అగ్రస్థానంలో నిలిపే వారియర్స్‌గా వలంటీర్లు ముందున్నారని  జిల్లా కలెక్టర్‌ గం ధం చంద్రుడు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశా లలో ఆదివారం ‘వలంటీర్లకు వందనం’ పేరుతో సత్కార కార్యక్రమాన్ని నిర్వ హించారు. జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, రాష్ట్ర విద్యా పాఠశాలల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, అ సిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడు తూ... అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా జిల్లా ముందుండేలా వ లంటీర్ల వ్యవస్థ పనిచేస్తోందన్నారు. కరోనా సమయంలో జిల్లాలో ఉన్న 12 వేల మంది వలంటీర్లతో టెలీకాన్ఫరెన్స ద్వారా మాట్లాడి గ్రామస్థాయిలో కరోనా క ట్టడికి ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు గానీ, చెడ్డ పేరుగానీ రావాలంటే కింది స్థాయిలో ఉన్న వారితో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్న వలంటీర్లకు వందనం చేస్తున్నా మన్నారు. సీఎం దూరదృష్టితో చాలా ముఖ్యమైన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమాన్నైనా వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి  చేర్చగలుగుతున్నామన్నారు. ప్రతి వలంటీర్‌ వజ్రమేనన్నారు. ఎంపీ రంగయ్య మాట్లాడుతూ.... సీఎం జగన్మోహనరెడ్డి వలంటీర్ల వ్యవస్థను తీసుకురావడంతో ప్రపంచమంతా ఏపీవైపు చూస్తోందని.. దేశమంతా వలంటీర్ల వ్యవస్థను వేనోళ్ల కొనియాడుతోందన్నారు. తమ ప్రభుత్వానికి వలంటీర్లు కళ్లు, చెవులన్నారు. ఎలాంటి అవకతవ కలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకా లను ప్రజల దరిచేర్చేందుకు అప్పగించిన బాధ్యతను వలంటీర్లు సక్రమంగా నెరవేరుస్తున్నారన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని బలోపేతం చేసేందుకు వలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడుతోందన్నారు. అనంతరం శింగనమల నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామ వలంటీర్లలో ఆరుగురికి సేవా వజ్ర, 30 మందికి సే వారత్న, 1278 మందికి సేవామిత్ర అవార్డులను అందజేసి సత్కరించారు. మొ త్తం 1314 మంది వలంటీర్లకు సంబంధించి రూ. 1,35,30,000 మెగా చెక్కును జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు.  కార్యక్రమంలో ఆర్డీఓ గుణభూషణ్‌ రెడ్డి, డీపీఓ పార్వతి, తహశీల్దార్‌ మహబూబ్‌ బాష, ఎంపీడీఓ తేజోష్ణ, వివిధ శాఖల అధికారులు, వలంటీర్లు, పలువురు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement