ప్రజాస్వామ్యంలో ఓటరుదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2022-01-26T06:44:12+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటరుదే కీలకపాత్ర అని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నా రు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఓటరుదే కీలకపాత్ర
నూతన ఓటర్‌కు గుర్తింపు కార్డును అందజేస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 25: ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటరుదే కీలకపాత్ర అని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నా రు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట ర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ను అన్ని రాజకీయ పార్టీలకు పంపుతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓటరు కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసేందుకు నిర్ణయించిందని, దీంతో డూప్లికేట్‌ ఓటర్లకు అవకాశం ఉండదన్నారు. కొత్త ఓటర్ల నమోదు, వారిని చైతన్యవంతులను చేయడంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా నూతన ఓటర్లుకు గుర్తింపుకార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజేంద్రకుమార్‌, ఏవో శ్రీదేవి, తహసీల్దార్లు వెంక న్న, సుదర్శన్‌రెడ్డి, డీటీ కళ్యాణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:44:12+05:30 IST