ప్రజాస్వామ్యంలో ఓటరుదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2022-01-26T06:55:26+05:30 IST

ప్రజాస్వామ్యం లో ఓటరుదే కీలకపాత్ర అని, దేశాభివృద్ధికి సుపరి పాలన అందించే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటరుదే కీలకపాత్ర
ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్లు

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి 

 కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ 


నల్లగొండ క్రైం, జనవరి 25: ప్రజాస్వామ్యం లో ఓటరుదే కీలకపాత్ర అని, దేశాభివృద్ధికి సుపరి పాలన అందించే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. భారత ఎన్నికల వ్యవస్థాపక దినోత్సవం, 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సంద ర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, ప్రతి ఏడాది ఓటరు జాబితా సవరణ ఉంటుందని, 18 ఏళ్లు నిండిన వారు  తమ ఓటును నమోదు చేస ుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన స్పెషల్‌ కేటగిరీ అవార్డులను అధికారు లకు అందజేశారు. సాగర్‌ ఉపఎన్నిక సందర్భంగా పారదర్శకంగా, పకడ్బందీగా విధులు నిర్వహించినం దుకు మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం డీటీ విజయ్‌లకు రూ.15వేల నగదుతోపాటు అవార్డులను ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, వనమాల చంద్రశేఖర్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, ఏవో మోతీలాల్‌, సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


అందరి సహకారంతో పట్టణాభివృద్ధి 

అందరి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని అభి వృద్ధి చేయనున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. పట్టణంలోని గడియారం సెంటర్‌లో ఉన్న భూగర్భ జలవనరులు, ఆర్‌అండ్‌బీ, ఐబీ కార్యా లయాలను ఆయన సందర్శించారు. ఐబీ కార్యాల య ఆవరణలో ఉన్న భూగర్భ జలవనరుల కార్యా లయాన్ని వెంటనే పాత జడ్పీ భవనంలోకి మార్చా లని ఆదేశించడంతో ఇప్పటికే మార్చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సీఎం పట్టణ పర్యటనలో భాగంగా గడియారం సెంటర్‌లో ఉన్న కార్యాలయాలను పరిశీలించి పట్టణ అభివృద్ధికి సూచనలు చేశారని తెలిపారు. ఈ కార్యాలయాలున్న స్థానంలో అధునాతన నీలగిరి కళాభారతి, కొత్త కార్యాలయాలను నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. పాత జడ్పీ కార్యాలయంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయనవెంట భూగర్భ జలవనరుల శాఖ డీడీ సునిల్‌బాబు, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, పంచాయతీరాజ్‌ డీఈ నాగయ్య, డీఈవో భిక్షపతి తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-01-26T06:55:26+05:30 IST