వక్ఫ్‌ బోర్డ్డు ఆస్తుల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-17T05:11:16+05:30 IST

ప్రొద్దుటూరు మండలం మోడంపల్లె మసీదుకు చెందిన వక్ఫ్‌బోర్డు గెజిట్‌లో నమోదైన ఆస్తులను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్సాఫ్‌ జిల్లా కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు.

వక్ఫ్‌ బోర్డ్డు ఆస్తుల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వినతి పత్రం ఇస్తున్న ఇన్సాఫ్‌ సభ్యులు

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 16 : ప్రొద్దుటూరు మండలం మోడంపల్లె మసీదుకు చెందిన వక్ఫ్‌బోర్డు గెజిట్‌లో నమోదైన ఆస్తులను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్సాఫ్‌ జిల్లా కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వక్ఫ్‌బోర్డు ఆస్తుల ఆక్రమణపై ఇన్సాఫ్‌ నేత లు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ మోడంపల్లె గ్రామ పొలంలోని సర్వేనెంబరు 260లో 1.23 ఎకరాలు, 262లో 88 సెంట్లు, 263-1లో 18 సెంట్లు, 263-2లో 37సెంట్లు, 278-1లో 1.02 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు ఆస్తులు ఉన్నాయన్నారు. ఈ ఆస్తులను కొందరు నకిలీ డాక్యుమెంట్లు చూపించి క్రయ విక్రయాలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఈ భూములను చదును చేసి ప్లాట్లు వేశారన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వారు కోరారు. కార్యక్రమంలో ఇన్సాఫ్‌ జిల్లా కోశాధికారి ఎస్‌.గౌస్‌, నజరుల్లా స్వామి దర్గా ట్రస్ట్‌ సభ్యులు బాబా ఫక్రుద్దీన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబులేసు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:11:16+05:30 IST