‘గూగుల్‌ ప్లే పాస్‌’ పనితీరు ఎలా?

ABN , First Publish Date - 2020-12-26T07:15:18+05:30 IST

గూగుల్‌ ప్లే పాస్‌ ఎలా పనిచేస్తుంది, ఇండియాలో అది ఎప్పుడు వస్తుంది...

‘గూగుల్‌ ప్లే పాస్‌’ పనితీరు ఎలా?

  • గూగుల్‌ ప్లే పాస్‌ ఎలా పనిచేస్తుంది,  ఇండియాలో అది ఎప్పుడు వస్తుంది? 

-  శ్రీనివాస్‌ రావు, అనకాపల్లి


గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే పెయిడ్‌ అప్లికేషన్స్‌,  గేమ్స్‌ విడివిడిగా కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా నెలకు కొంత  రుసుము తీసుకోవడం ద్వారా ప్రముఖ పెయిడ్‌ యాప్స్‌, గేమ్స్‌ని  నెల రోజుల పాటు ఉచితంగా ఉపయోగించుకునేలా వినియోగదారులకు అవకాశం కల్పించడం కోసం గూగుల్‌ సంస్థ ఇటీవల తీసుకొచ్చిన సర్వీస్‌ ‘‘గూగుల్‌ ప్లే పాస్‌’’.  ప్రస్తుతం ఇది యూఎస్‌లో  మాత్రమే అందుబాటులో ఉంది.  భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు 353  రూపాయలు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.  కేవలం కొన్ని ఎంపిక చేసిన అప్లికేషన్స్‌, గేమ్స్‌ మాత్రమే ఈ గూగుల్‌ ప్లే పాస్‌ ద్వారా నెల రోజుల పాటు ఉచితంగా వాడుకోవటానికి లభిస్తాయి. అంతే తప్పించి అన్ని పెయిడ్‌ అప్లికేషన్స్‌,  గేమ్స్‌ ఈ విధానం ద్వారా లభించవు. ఒకవేళ భవిష్యత్తులో అప్లికేషన్‌ డెవలపర్లకు గూగుల్‌ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరితే మరి కొన్ని అప్లికేషన్స్‌ ఈ పాస్‌ ద్వారా లభించే అవకాశం ఉంది.

Updated Date - 2020-12-26T07:15:18+05:30 IST