కార్మిక హక్కుల రక్షణకు పోరాటమే మార్గం

ABN , First Publish Date - 2021-12-06T04:36:51+05:30 IST

ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడు కునేందుకు పోరాటమే సరైన మార్గమని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీ యూసీ) రాష్ట్ర కార్యదర్శి నరసింహ అన్నారు.

కార్మిక హక్కుల రక్షణకు పోరాటమే మార్గం
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ

-  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ

గద్వాల టౌన్‌, డిసెంబరు 5 : ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడు కునేందుకు పోరాటమే  సరైన మార్గమని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీ యూసీ) రాష్ట్ర కార్యదర్శి నరసింహ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేలా తెచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకునే వర కు ఏఐటీయూసీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఆ దివారం పట్టణంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఏఐటీయూసీ గద్వాల జిల్లా ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకోకుండా  వారి హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారుల ప్రయోజనాలే లక్ష్యంగా కార్మిక చట్లాను నీరు గార్చే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. వం ద ఏళ్లుగా కార్మికుల హక్కులు, ప్రయోజనాలు కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ఏఐటీయూసీ చేసిన కృషి వల్లే అనేక చట్టాలు రూ పుదాల్చుకున్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కమిటీలో కార్యదర్శిగా నరసింహు లును ఎంపిక చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి. ఆంజనేయులు, వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ బాలగోపాల్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రంగన్న, ఉపాధ్యక్షులు రామనాథ్‌, కృష్ణ, సహాయ కార్యద ర్శు లు బతుకన్న, నారాయణ, ఆశన్న, సత్యరాజు, చెన్న య్య, పరమేష్‌, శాంతిరాజు ఉన్నారు. 

Updated Date - 2021-12-06T04:36:51+05:30 IST