Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచ శాంతికి మార్గం హిందూ ధర్మం

శంకర్‌పల్లి : ప్రపంచ శాంతి మార్గానికి హిందూ ధర్మం మాత్రమే దారి చూపగలదని సమరసత రాష్ట్ర కుటుంబ ప్రమోదన్‌ ప్రముఖ్‌ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని  డీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా జంటలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మం అతి పురాతనమైనదని, ప్రతిఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో దామోదర్‌రెడ్డి, నర్సింలు, సురేష్‌, రామ్మోహన్‌, సాయికుమార్‌, అచ్చిరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.Advertisement
Advertisement