తూకం చేసిన ధాన్యాన్ని తరలించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:55:17+05:30 IST

తూకం చేసిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని మండల పరిధిలోని చెన్న వెళ్లి గ్రామనికి చెందిన రైతులు కోరుతున్నారు.

తూకం చేసిన ధాన్యాన్ని తరలించాలి
రైతుల పొలంలో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంతో రైతులు

రాజాపూర్‌, జూన్‌ 18 :తూకం చేసిన  ధాన్యాన్ని త్వరగా తరలించాలని మండల పరిధిలోని చెన్న వెళ్లి గ్రామనికి చెందిన రైతులు కోరుతున్నారు. శుక్రవారం ఆ గ్రామానికి చెందిన రైతులు రమేష్‌ రెడ్డి, శేఖర్‌రెడ్డిలు మాట్లాడుతూ తమ గ్రామం సమీపంలోని ఉన్న తిర్మలాపూర్‌ గ్రామంలో ఏర్పా టు చేసిన వరిధాన్యం కొనుగోలు సెంటరు ఆధ్వ ర్యంలో చెన్నవెళ్లి గ్రామంలోని రైతుల దగ్గర పంట పొలాల్లోనే ధాన్యం సుమారు వెయ్యి సంచుల తూ కం చేసి 15 రోజులు అయినా తరలించడం లేదని ఆవేదనతో తెలిపారు. మూడు నాలుగు రోజులుగా వర్షాలు పడుతుడంటంతో సంచుల్లో ఉన్న వడ్లు మొలకెత్తుతున్నాయని అన్నారు.  ధాన్యం బస్తాల ను తరలించాలని కోరుకుంటున్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్ల ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా   రైతు లు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొను గోలు చేస్తుందని తెలిపారు. రైతుల పొలాల వద్ద ధాన్యం బస్తాలుంటే ప్రభుత్వానికి సంబంధం లేద ని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ధాన్యం తరలిస్తున్నామని, ముఖ్యంగా లారీల కొరత ఉన్నం దున సమయం పడుతోందని తెలిపారు.


Updated Date - 2021-06-19T05:55:17+05:30 IST