వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

ABN , First Publish Date - 2022-08-20T05:36:30+05:30 IST

వృద్ధుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ద్యేయమని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు.

వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
వృద్ధులకు పండ్లు అందజేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌

జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత

వృద్దాశ్రమం, ప్రభుత్వ ఆసుపత్రి, సబ్‌ జైలులో పండ్ల పంపిణీ

పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, బల్దియా అధ్యక్షురాలు, అదనపు కలెక్టర్‌

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 19: వృద్ధుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ద్యేయమని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. 75వ, స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీగుట్ట రాజేశ్వర స్వా మి ఆలయం సమీపంలో ఉన్న శివగాయత్రీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు  కలెక్టర్‌తో కలిసి పండ్లు పంపిణీ చేశారు. అలాగే మాత శిశు సంరక్షణ కేంద్రం, బాల సదన్‌లో బల్దియా అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి ఎ మ్మెల్యే సంజయ్‌ కుమార్‌ రోగులకు పండ్లు, విద్యార్థులకు స్వీట్లు అంద జేశారు. సబ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైధీలకు సబ్‌ జైలర్‌ సత్తయ్య ఆధ్వర్యంలో పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమాల్లో ఒంటరిగా జీవించే వారికి మేమున్నాం అంటూ భరోసా కల్పిం చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటాంటి కార్యక్రమాలు చేపట్టిందని వివరిం చారు. జిల్లా మంత్రి సూచనల మేరకు జిల్లా కేంద్రంలో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌, వృద్ధాశ్రమాలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సం స్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, రాష్ట్ర కౌ న్సిలర్ల ఫొరం ఉపాధ్యక్షుడు బొడ్ల జగదీష్‌, ఎంపీపీ రాజేంద్ర ప్రపాద్‌, జడ్పీ సీఈవో రామానుజ చార్యులు, జిల్లా సంక్షేమాధికారి నరేష్‌, కౌన్సిలర్‌ బాలె లత శంకర్‌, కమిషనర్‌ స్వరూప రాణి, డీఈ రాజేశ్వర్‌, సూపరిం టెండెంట్‌ రాములు, టీవీ సత్యం, అభి, ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ శివ శంకర్‌, హరి అశోక్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-20T05:36:30+05:30 IST