రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-04-17T05:52:11+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హుజూరాబాద్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఈటల

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం 

మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17శాతం తేమ మించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు, దిగుమతులు జరుగుతాయన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో హమాలీ, ట్రాన్స్‌పోర్టు, సంచుల కొరత లేకుండా చేశామన్నారు. మిల్లుల్లోకి ధాన్యం వెళ్లగానే దించుకోవాలని మిల్లర్లకు సూచించారు. కరోనా విజృంభిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో రైతులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో  అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లా ల్‌, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి సురేష్‌రెడ్డి, డీఎం శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ భర్మావత్‌ రమ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, ఆర్డీవో బెన్‌షాలేమ్‌, తహసీల్దార్‌ బావ్‌సింగ్‌ పాల్గొన్నారు.


హుజూరాబాద్‌ రూరల్‌లో...


హుజూరాబాద్‌ రూరల్‌: హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌లో  మం త్రి ఈటల రాజేందర్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చెల్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. టీకా పంపిణీ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ రమాదేవి టీకా పంపిణీపై మంత్రికి వివరించారు. టీకాపై గ్రామీణ ప్రాం తాల్లో విస్తృత అవగాహన కల్పించి 45ఏళ్లు పైబడిన వారందరు టీకా తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

వీణవంక: వల్భాపూర్‌, వీణవంక గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా ఆడ మగ సీడ్‌ పండిస్తారన్నారు. సీడ్‌లోని మగ రకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. తేమ లేకుండా ధాన్యం ఇంటి వద్దనే శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తాలు, మట్టి, తేమ శాతం ఉన్న ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు కిలోల కోత పెడుతున్నారని మాటలు వస్తున్నాయని, అలాంటి ఆరోపణలకు తావు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ధాన్యం మిల్లులకు తరలింపులో  కలెక్టర్‌, జేసీలు నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గం లో  టెస్టులు చేస్తున్నామని, వ్యాక్సిన్‌ కూడా అందిస్తున్నామన్నారు. పాజిటివ్‌ వచ్చి ఏమైనా ఇబ్బందులు జరిగితే ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ఖర్చుపెట్టకుండా తనకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి పనులను పరిశీలించి ఎస్‌ఐ కిరణ్‌రెడ్డిని అభినందించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమం లో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు, సింగిల్‌విండో చైర్మన్‌ మావురపు భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

జమ్మికుంట రూరల్‌: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ ఆన్నారు. శుక్రవారం తనుగుల గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకు రావాలని సూచించారు. మిల్లుల్లో ధాన్యం దిగుమతి సమయంలో కొర్రీలు పెట్టి, కోతలు పెట్టకుండా ఉండాలంటే ఆరబెట్టి, తాలు, తప్ప లేకుండా శుభ్ర పరిచి తీసుకు రావాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, డిసిఎమ్‌ఎస్‌ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, జెట్పీటీసీ డాక్టర్‌ శ్రీరామ్‌ శ్యామ్‌, ఎంపిపి దొడ్డె మమత, నాయకులు దేశీని కోటి, ఎమ్మార్వో కన్నం నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:52:11+05:30 IST