ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-06T06:50:54+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లబ్ధిదారులకు ఫించాన్‌ కార్డులను పంపీణి చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ఫ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

బుగ్గారం సెప్టెంబరు 5: తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను  ప్రవేశపెట్టి అమలు చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఈ మేరకు బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చే సిన కార్యక్రమంలో మండలంలోని 700 మంది లబ్దిదారులకు నూతన పిం ఛన్ల మంజూరు కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సంధరర్డంగా మం త్రి మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకం విజయవం తం గా నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే 50 లక్షల కు టుంబాలకు వివిధ రాకల పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పేద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్‌, ఎంపీపీ బాదినే ని రాజమణి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ ఫారుక్‌, ఎంపీడీవో తిరుపతి, వైస్‌ ఎంపీపీ సుచేందర్‌, టీఅర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు గాలిపేల్లి మహేష్‌, మండల యూత్‌ అధ్యక్షులు కట్ట రాజేందర్‌ మం డల కో ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ రహమన్‌, సర్పంచ్‌ మూల సుమలత- శ్రీని వాస్‌, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-06T06:50:54+05:30 IST