పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-17T10:35:33+05:30 IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం కౌటాల ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప


కౌటాల, సెప్టెంబరు16: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం కౌటాల ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కట్నం కింద రూ.1.16 లక్షలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు పంట పెట్టుబడికి రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ందన్నారు. మండలంలో మొత్తం 133 కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, ఎంపీపీలు విశ్వనాథ్‌, నానయ్య, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీఓ ప్రభు, జడ్పీటీసీ అనూష, ఉపాధ్యక్షురాలు అమ్మక్క, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌గౌడ్‌, సంతోష్‌గౌడ్‌, శ్రీధర్‌, గట్టయ్య, బాపు, ప్రభాకర్‌గౌడ్‌, అశోక్‌, సర్పంచ్‌ మౌనీష్‌, ఉప సర్పంచ్‌ తిరుపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  


కౌటాల(సిర్పూర్‌-టి): సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని జీషాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణ, జడ్పీటీసీ నీరేటి రేఖ, సర్పంచ్‌ ఫాతీమా పర్వీన్‌, కో ఆప్షన్‌ సభ్యుడు కీజర్‌హుస్సెన్‌, నాయకులు బి.శ్రీనివాస్‌, తుకారాం, సత్యనారాయణ, శంకర్‌, కిశోర్‌, ఇఫ్పతుస్సెన్‌, నాని, మోహీజ్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-17T10:35:33+05:30 IST