Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యం

రామాపురం, నవంబరు 30: రామరాపుపల్లె వంకలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరస్వతిపల్లె గ్రామ పంచాయతీ ఉడుంవారిపల్లెకు చెందిన పగడాల బాబు (8) సోమవారం సాయంత్రం రామరాజువంకలో ప్రమాదశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. తహసీల్దార్‌ ఖాజాబీ, లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ జయరాములు బృందం మంగళవారం ఉదయం నుంచి గాలింపు చేయడంతో సాయంత్రానికి మృతదేహాన్ని కనుగొన్నారు. బాలుడు పడిన చోటే మృతదేహం లభించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గంగనేరు ప్రాజెక్టు నుంచి గాలింపు చర్యలు చేపట్టి పడిన ప్రదేశంలోనే మృతదేహాన్ని కనుగొన్నారు. బాలుడి తల్లి లక్ష్మిదేవి, సుబ్బయ్యలను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. 

Advertisement
Advertisement