మొద్దు ప్రభుత్వాన్ని స్కూటర్‌ యాత్ర కదిలించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:51:35+05:30 IST

: రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఈ మొద్ద ప్రభుత్వాన్ని స్కూ టర్‌ యాత్రతో కదిలించాలని వక్తలు పేర్కొన్నారు.

మొద్దు ప్రభుత్వాన్ని స్కూటర్‌ యాత్ర కదిలించాలి
స్కూటర్‌ యాత్ర చేపడుతున్న దృశ్యం


రైతు కూలీ రక్షణ స్కూటర్‌ యాత్ర ప్రారంభ సభలో వక్తలు


అనంతపురం టౌన, జనవరి 21: రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఈ మొద్ద ప్రభుత్వాన్ని స్కూ టర్‌ యాత్రతో కదిలించాలని వక్తలు పేర్కొన్నారు. ఏపీ రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన రైతు కూలీ రక్షణ స్కూటర్‌ యాత్ర శుక్రవారం అనంతపురం నగరంలో ప్రెస్‌క్లబ్‌ నుంచి ప్రారంభమైంది. ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాం భూపాల్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ యాత్ర ఈనెల 24న అమరావతి చేరుకోనుంది. అనంతరం అక్కడ రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, మానవహక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం బాషా, చంద్రశేఖర్‌, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు జెండా ఊపి, యాత్రను ప్రారంభించారు.  ఈ సందర్భంగా గేయానంద్‌ మాట్లాడుతూ.. ప్ర భుత్వం ఇప్పటికైనా రైతాంగ సమస్యలపై మొద్దునిద్ర వీడాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన అనంతపురం లాంటి ప్రా ంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా అన్యాయం చేసిందని గుర్తు చేశారు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తక్షణమే రైతాంగ సమస్యలపై స్ప ందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మానవ హక్కుల వేదిక నాయకుడు ఎస్‌ఎం బాషా మాట్లాడుతూ... ప్రభుత్వం, రైతుల సమస్యలపట్ల ప్రభుత్వ మొద్దు నిద్ర వహిస్తోందన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు కూడా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ యాత్రతోనైనా వారిలో చలనం రావాలని ఆకాంక్షించారు. ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంభూపాల్‌ మాట్లాడుతూ... రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను కొన్ని నెలలుగా నిరంతరాయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పటికీ స్పష్టమైన చర్యలేవీ లేవన్నారు. అందుకే అమరావతికి స్కూటర్‌ యాత్ర చేపట్టామని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకునే విషయంలో వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు బాలరంగయ్య, కృష్ణమూర్తి, రైతుసంఘం నేత శివారెడ్డి, సీఐటీయూ నాయకుడు రామిరెడ్డి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఆవాజ్‌ ముష్కిన, వలి, రజకవృత్తిదారుల సంఘం నాయకులు నాగప్ప, ఆంజనేయులు, డీవైఎ్‌ఫఐ బాలకృష్ణ, నూరుద్దీన, ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:51:35+05:30 IST