లోకమంతా నాన్నే..!

ABN , First Publish Date - 2021-06-20T09:21:53+05:30 IST

బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రితి శెట్టి..., సినిమా ప్రొడక్షన్‌, డిస్ర్టిబ్యూషన్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న జాన్వీ నారంగ్‌ ‘ఫాదర్స్‌డే’ సందర్భంగా ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

లోకమంతా నాన్నే..!

‘‘హాస్యంతో, అల్లరితో నన్ను నిత్యం ఆటపట్టించి, నవ్వించే మానాన్న నాకెప్పుడూ ప్రత్యేకమే. సినిమాలు చేస్తానంటే నాకు తోడుగా నిలిచాడు. నా మొదటి చిత్రం ‘ఉప్పెన’ చూశాక ఆనందంతో నాన్న కన్నీళ్లాగలేదు. మనసున్న మా మంచి నాన్నే నాకు కొండంత అండ’’

క్రితి శెట్టి


‘‘కార్పొరేట్‌ స్కూళ్లలో, కాలేజీల్లో చెప్పని మేనేజ్‌మెంట్‌ పాఠాలు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర చెబుతుంటే అలవోకగా నేర్చుకున్నా. పురుషులే కాదు స్ర్తీలు అద్భుతంగా వ్యాపారంలో రాణించొచ్చనే నమ్మకాన్ని, ధైర్యాన్ని నాకు మొదట ఇచ్చింది నాన్నే’’

జాన్వీ నారంగ్‌ 


బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రితి శెట్టి..., సినిమా ప్రొడక్షన్‌, డిస్ర్టిబ్యూషన్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న జాన్వీ నారంగ్‌ ‘ఫాదర్స్‌డే’ సందర్భంగా ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. 


‘‘నేను స్కూల్లో చదువుకొనే సమయంలో- స్కూలు పక్కనే మెక్‌డొనాల్డ్స్‌ ఉండేది. నన్ను స్కూలు నుంచి తీసుకువెళ్లటానికి నాన్న రోజు వచ్చేవారు. వారంలో కనీసం రెండు, మూడు సార్లు మెక్‌డొనాల్డ్స్‌కు తీసుకువెళ్లి నాకు నచ్చినవి కొనిపెట్టేవారు. అందరూ మెక్‌డొనాల్డ్స్‌కు తీసుకువెళ్తారు.. ఇందులో పెద్ద గొప్పేముంది అని అనుకోవచ్చు. కానీ దీని వెనక కూడా ఒక కథ ఉంది. చిన్నప్పుడు నేను తిండి సరిగ్గా తినేదాన్ని కాదు. అమ్మ విసుక్కొనేది. కొన్ని సార్లు కోపం వచ్చి అరిచేది. అమ్మ ఎంత అరిచినా నేను తిండి మాత్రం తినేదాన్ని కాదు. దాంతో కొద్దిగా బలహీనంగా ఉండేదాన్ని. అందుకే నాన్నకు నా తిండి మీద ధ్యాస ఎక్కువగా ఉండేది. నేను చదివినా.. చదవకపోయినా పర్వాలేదు. కానీ తిండితినాలి. అప్పట్లో అమ్మ షాపర్స్‌స్టాప్‌ బ్రాండ్‌కు డిజైనర్‌గా పనిచేసేది. ఎప్పుడైనా అమ్మ బయటకు వెళ్తే చాలు.. మా ఇద్దరికీ పండగే.


నేను ఏదైనా వద్దంటే చాలు. వెంటనే వేరేది ఆర్డర్‌ చేసేవారు. ఆ తర్వాత అమ్మ వచ్చిన తర్వాత ఆ విషయం తెలిస్తే- నాన్నతో గొడవ పెట్టుకొనేది. నా చిన్నతనంలో ఇలాంటి గొడవలెన్నో! నాన్నకు నా ఫుడ్‌ మీద ఎక్కువ శ్రద్ధ ఉండటానికి ఇంకో కారణం ఉంది. నాన్న వృతిరీత్యా హోటలియర్‌. ముంబాయి శివార్లలో నాన్నకు ఒక హోటల్‌ ఉంది. అప్పుడప్పుడు నేను కూడా అక్కడకు వెళ్లేదాన్ని. అక్కడకు వెళ్తే నన్ను చిన్న యువరాణిలా చూసేవారు. జ్యూస్‌లు ఇచ్చేవారు.. ఐస్‌క్రీమ్‌ పెట్టేవారు.. చిన్నతనంలో అంతకన్నా ఏం కావాలి..


ఆ అలవాటే..

నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాన్న, నేను కూర్చుని టీవీ షోలు చూసేవాళ్లం. ఇప్పటికీ ఎప్పుడైనా ఖాళీ దొరికితే టీవీకి అతుక్కుపోతాం. ఇక్కడ మీకు ఒక సీక్రెట్‌ చెప్పాలి. ఇలాంటి షోలలో చాలా బ్యాడ్‌ జోక్స్‌ ఉంటాయి. వాటిని వింటే నవ్వురాదు. బహుశా అలాంటి షోలు ఎక్కువ చూడటం వల్ల అనుకుంటా. మా ఇద్దరికీ బ్యాడ్‌ జోక్‌లు వేసే అలవాటు వచ్చింది. మేమిద్దరం వేసే జోకులకు ఎవ్వరికీ నవ్వురాదు. కానీ జోక్స్‌ వేస్తూనే ఉంటాం. నాన్నకు, నాకు ఉన్న బలహీనత అది.. ఏం చేస్తాం! ఇక చదువులో నేను బ్రిలియంట్‌ అని చెప్పను కానీ మరీ డల్‌ కూడా కాదు. మంచి మార్కులే వచ్చేవి. అందువల్ల అమ్మ, నాన్నలు నన్ను చదువు విషయంలో ఏమి అనేవారు కాదు. మా ఇంటికి తరచు నాన్న స్నేహితులు తమ కుటుంబాలను తీసుకువచ్చేవారు. మేము వాళ్ల ఇళ్లకు వెళ్లేవాళ్లం. వారంలో కనీసం రెండు మూడు రోజులు ఇలా గడిచిపోయేది. ఆ సమయంలో నేను ఒక విషయాన్ని గమనిస్తూ ఉండేదాన్ని. నాన్న పెద్దవాళ్లతో ఎలా కలిసిపోయేవారో.. పిల్లలతో కూడా అలాగే కలిసిపోయేవారు. నా ఫ్రెండ్స్‌ అందరూ నాన్నకు కూడా ఫ్రెండ్స్‌. 


ఎప్పుడూ ఆంక్షలు లేవు..

నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి సరదాగా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో నటిస్తూ ఉండేదాన్ని. డైరీ మిల్క్‌, ఐడియా- ఇలాంటి ప్రకటనల్లో నాకు మంచి పేరు వచ్చింది. అమ్మ షాపర్స్‌ స్టాప్‌లో పనిచేసేది కాబట్టి వాళ్ల బాస్‌ నన్ను ఆ బ్రాండ్‌ అడ్వైర్‌టైజ్‌మెంట్‌లో నటించమన్నారు. ఆ సమయంలోనే నన్ను పూరీ కనెక్ట్‌ వాళ్లు చూశారు.. ఆ తర్వాత నాకు ఉప్పెన సినిమా వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఏమి లేదు. మా ఇంట్లో అమ్మ కజిన్స్‌, నాన్న కజిన్స్‌, నా కజిన్స్‌లో ఎక్కువ మంది డాక్టర్లే. నేను కూడా డాక్టరే అవ్వాలనుకున్నా. నేను తొలి సారి అడ్వైర్‌టైజ్‌మెంట్‌లో నటించినప్పుడు కానీ.. సినిమాలో నటిస్తానన్నప్పుడు కానీ నాన్న నాకు అడ్డుచెప్పలేదు. ‘‘కష్టంగా కాదు.. ఇష్టంగా పనిచేయి. నిజాయితీగా నువ్వు ఎంత పనిచేయగలవో చేయి.. ’’ అని నాన్న నాకు సలహా ఇచ్చారు.


ఉప్పెన షూటింగ్‌ మొదలయ్యే దాకా నాకు నటనంటే మోజు ఉండేది కాదు. మొదటి రోజు షూటింగ్‌లో కెమెరా ముందు నిలబడిన తర్వాత- నటనలో ఉండే మజా తెలిసింది. ఉప్పెన షూటింగ్‌ సమయంలో నాన్న ఎప్పుడూ సెట్‌కు వచ్చేవారు కాదు. రెండు సార్లు మాత్రమే వచ్చారు. ఇక ఆ సినిమా విడుదల సమయంలో నాన్న మంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మా చుట్టాలతో నాన్న ఆ సినిమా చూశారు. మేము ఆ సమయంలో కోల్‌కత్తాలో ఉన్నాం. నాన్న సినిమా పూర్తయిన తర్వాత నాకు ఫోన్‌ చేశారు. ‘‘చాలా ఆశ్చర్యంగా ఉంది..’’ అన్నారు. ఫోన్‌లో ఆ మాటలు కూడా స్పష్టంగా రావటం లేదు. నాన్న ఏడుస్తున్నారని అర్థమయింది. ‘ఏడుస్తున్నావా.. నాన్న..’’ అన్నా. వెంటనే తేరుకొని.. ‘లేదు.. అదేం లేదు.. చాలా బాగా చేశావు.. సినిమా చాలా బావుంది..’’ అన్నారు. ‘‘కానీ’’.. అని ఆగారు. నాకు టెన్షన్‌. ‘‘ఇంకా కష్టపడి పనిచేయాలి.. అప్పుడే ఈ సక్సెస్‌ నిలబెట్టుకోగలవు’’ అన్నారు. ఆ తర్వాత టాపిక్‌ మళ్లించి ఏవో కబుర్లు చెప్పారు. నాన్న అప్పుడే కాదు.. ఇప్పటికీ ఒప్పుకోరు కానీ.. వెండితెరపై నన్ను చూసిన ఆనందంతో ఏడ్చారనే విషయం నాకు తెలుసు. నాన్నకు ఇప్పటికి నేను తిండి తినననే బెంగే! అందుకే నేను షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఫోన్‌ చేస్తే - ‘తిన్నావా..’’ అని సంభాషణ మొదలుపెడతారు. బహుశా తండ్రి మనసు ఎప్పుడూ పిల్లల మీదే ఉంటుందనుకుంటా! అందరికీ హ్యాపీ ఫాదర్స్‌ డే!’


నా సినిమా చూసి ఏడ్చారు

మా ఇంట్లో అమ్మ కజిన్స్‌, నాన్న కజిన్స్‌, నా కజిన్స్‌లో ఎక్కువ మంది డాక్టర్లే. నేను కూడా డాక్టరే అవ్వాలనుకున్నా. నేను తొలి సారి ప్రకటనలో నటించినప్పుడు కానీ.. సినిమాలో నటిస్తానన్నప్పుడు కానీ నాన్న నాకు అడ్డుచెప్పలేదు. ‘‘కష్టంగా కాదు.. ఇష్టంగా పనిచేయి. నిజాయితీగా నువ్వు ఎంత పనిచేయగలవో చేయి...’’ అని నాన్న నాకు సలహా ఇచ్చారు. ’


ఆయన చెప్పే పాఠం ఏ పుస్తకాల్లోనూ ఉండదు

‘‘మీ నాన్నను ఎలా నిర్వచిస్తావు? అని ఎవరైనా అడిగితే వెంటనే - ‘నా నీడ’ అని సమాధానమిస్తా. చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా అన్ని సందర్భాలలో.. అన్ని అవసరాలలో.. అన్ని వేళల నాతో ఉండి నన్ను చూసుకొనే వ్యక్తి మా నాన్న. అందుకే మీ నాన్నకు సంబంధించిన ఒక తీపి జ్ఞాపకం చెప్పమని ఎవరైనా అడిగితే- వెంటనే ఏదీ గుర్తుకురాదు. ఎందుకంటే నాన్నతో నాకున్నవన్నీ తీపి జ్ఞాపకాలే! చిన్నప్పుడు నన్ను స్కూలుకు తీసుకువెళ్లి దింపినా.. స్కూల్‌ డే ఫంక్షన్స్‌కు వచ్చి నన్ను ఎంకరేజ్‌ చేసినా.. నేను ఏది కావాలన్నా కాదనకుండా తెచ్చి ఇచ్చినా.. నా స్వేచ్ఛకు గౌరవమిచ్చి నాకు నచ్చిన కోర్సులు చేయనిచ్చినా.. ఇలా అన్ని సంఘటనల వెనక నాన్నే కనిపిస్తారు. ఇప్పటి దాకా నాకు తెలిసిన వ్యక్తులందరిలోను నాన్న మోస్ట్‌ కేరింగ్‌. నాతోనే కాదు.. చుట్టాలు.. బంధువులు.. మా వద్ద పనిచేసే సిబ్బంది.. ఎవరితోనైనా నాన్న అలాగే ఉంటారు. ఈ విషయంలో నాన్నను చూస్తే తాతగారు గుర్తుకువస్తారు.


ఆయన కూడా అంతే! వీరిద్దరికి ఒకే రకమైన పోలికలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాన్న ఎంత కేరింగో.. అంత స్ట్రిక్ట్‌ కూడా! స్ట్రిక్ట్‌ అనటం కన్నా క్రమశిక్షణ అంటే బావుంటుందేమో! ప్రతి పని నిబద్ధతతో, క్రమశిక్షణగా చేస్తారు. తాను ఎంత క్రమశిక్షణతో ఉంటారో.. తనతో పనిచేసేవారందరూ కూడా అలాగే ఉండాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి ఆ క్రమశిక్షణ విలువ నాకు తెలుసు. 




ఇంటర్వ్యూలు: సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌



ఇద్దరూ ఇద్దరే..

నువ్వు ఎమోషనల్‌గా అమ్మనాన్నలలో ఎవరిపై ఎక్కువ ఆధారపడతావు? అని కొందరు స్నేహితులు అడుగుతూ ఉంటారు. నాకు ఇద్దరూ రెండు కళ్లలాంటివారు. అయితే అమ్మ నాకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తే.. నాన్న అన్ని సందర్భాలలో భరోసాగా నిలిచారు. నేను భవిష్యత్తులో ఏమి సాధిస్తానో నాకు తెలియదు. కానీ నాన్న, తాత నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ సంపాదించిన మంచి పేరులో కనీసం సగం సంపాదించుకోగలిగితే అంత కన్నా నాకు కావాల్సింది ఏమి లేదు. అదే నేను నాన్నకు ఇవ్వగలిగిన ఫాదర్స్‌ డే బహుమతి.


మా ఇంట్లో అమ్మ కజిన్స్‌, నాన్న కజిన్స్‌, నా కజిన్స్‌లో ఎక్కువ మంది డాక్టర్లే. నేను కూడా డాక్టరే అవ్వాలనుకున్నా. నేను తొలి సారి ప్రకటనలో నటించినప్పుడు కానీ.. సినిమాలో నటిస్తానన్నప్పుడు కానీ నాన్న నాకు అడ్డుచెప్పలేదు. ‘‘కష్టంగా కాదు.. ఇష్టంగా పనిచేయి. నిజాయితీగా నువ్వు ఎంత పనిచేయగలవో చేయి...’’ అని నాన్న నాకు సలహా ఇచ్చారు. 

క్రితి శెట్టి



నాన్న ఎంత కేరింగో.. అంత స్ట్రిక్ట్‌ కూడా! స్ట్రిక్ట్‌ అనటం కన్నా క్రమశిక్షణ అంటే బావుంటుందేమో! ప్రతి పని నిబద్ధతతో చేస్తారు. తాను ఎంత క్రమశిక్షణతో ఉంటారో.. తనతో పనిచేసేవారందరూ కూడా అలాగే ఉండాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి దాని విలువ నాకు తెలుసు. 

జాన్వి నారంగ్‌, సీఎంవో, ఏషియన్‌ సినిమాస్‌


సినిమా ప్రపంచమే..

నాన్న ఒక పెద్ద నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌. అందువల్ల నా చిన్నతనం నుంచి సినిమాలకు సంబంధించిన విషయాలు వింటూ పెరిగా. మా సంభాషణలన్నింటిలోను సినిమాకు సంబంధించిన ఏదో ఒక కోణం ఉంటుంది. బహుశా నేను ఫిల్మ్‌ మార్కెటింగ్‌ను నా వృత్తిగాఎంచుకోవటానికి కూడా కారణమిదే కావచ్చు. అయితే మరో విషయం కూడా చెబుతా. నేను సినిమా ప్రపంచపు పరిధిల్లోనే పెరిగినా.. స్టార్‌లు, ఆర్టిస్టులలో నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి నా దృష్టంతా చదువు మీదే! ఏదైనా ప్రత్యేకమైన ఫీల్డ్‌ను ఎంచుకొని చదువుకోవాలనేది నా కోరిక. ఈ విషయంలో నాన్న నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 


నేను అండర్‌ గ్రాడ్యుయేషన్‌కు విదేశాలకు వెళ్తానన్నప్పుడు అభ్యంతరం పెట్టలేదు. నాకే కాదు చెల్లి సిమ్రాన్‌కు కూడా చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అండర్‌గ్రాడ్‌ పూర్తి అయిన తర్వాత నేను వార్విక్‌ బిజినెస్‌ స్కూల్లో మార్కెటింగ్‌లో ఎమ్మెస్సీ చేసా. ఆ సమయంలో ప్రతి రోజూ నాన్నతో కనీసం రెండు సార్లు మాట్లాడేదాన్ని. తను ఇండియాలో విషయాలు చెప్పేవారు. నేను అక్కడి విషయాలు చెప్పేదాన్ని. నాన్న తన బిజినెస్‌ గురించి.. వాటిలో తీసుకున్న నిర్ణయాలు చెబుతూ ఉండేవారు. వాటి ద్వారా నేను నేర్చుకున్న పాఠాలెన్నో! ఇవి ఏ పాఠ్య పుస్తకాల్లోను చెప్పరు. ఒక విధంగా నాన్న నాకు క్లాసులో పాఠాలు చెప్పని గురువు! ఇక నాన్న దగ్గర నేను నేర్చుకున్న మరో అంశం- ఏ విషయాన్నైనా నిశీతంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవటం. ఒక సారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండటం.


ఇది వినటానికి చాలా సులభంగా ఉంటుంది కానీ నిర్ణయం తీసుకొనే ముందు అనేక కోణాల నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. అయితే నిర్ణయం అమలు చేసే విషయంలో ఎటువంటి సందిగ్దతా ఉండదు. నా చదువు విషయంలో లాగే.. నేను ఏషియన్‌ సినిమాస్‌లో చేరతానన్నప్పుడు కూడా నాన్న ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వాస్తవానికి సినిమా డిస్ట్రిబ్యూషన్‌, మార్కెటింగ్‌ రంగాలలో పురుషులే ఎక్కువ. సినిమా మార్కెటింగ్‌లో ఉన్న మహిళల సంఖ్య అయితే వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయినా నాన్న ఎటువంటి సంకోచం లేకుండా- నా నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఏషియన్‌ సినిమాస్‌లో చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)గా  నేను తీసుకొనే నిర్ణయాలలో నాన్న ఎప్పుడూ కలగజేసుకోరు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. నిర్ణయాలు తీసుకొనే సమయంలో సరైన మార్గదర్శకత్వం అందించటం.. నిర్ణయం తీసుకున్న తర్వాత అవి సక్రమంగా అమలయ్యేలా చూడటంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించటం.. ఒక బాస్‌కు ఉండాల్సిన లక్షణాలని నేను భావిస్తా. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న నాన్నలాంటి బాస్‌ దొరకటం ఒక వరం.

Updated Date - 2021-06-20T09:21:53+05:30 IST