Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొలంలో పనుందంటూ భర్తను తీసుకెళ్లిన భార్య.. అయితే అక్కడ అలాంటి సీన్ జరుగుతుందని అతను ఊహించలేకపోయాడు..

మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే భార్యాభర్తలు.. జీవితాంతం అదే బంధానికి కట్టుబడి ఉంటారు. చావైనా, బతుకైనా.. కష్టమైనా, నష్టమైనా కలిసే ఉంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. తాత్కాలిక సంతోషాలకు అలవాటు పడ్డ వారు.. చివరకు తమ కాపురాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు చివరికి సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఓ కుటుంబంలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే..

ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి జిల్లా చన్గోముల్‌ గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. వీరికి ఇటీవల శేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వెంకటయ్య భార్యతో చనువుగా ఉండడం మొదలెట్టాడు. అది కాస్తా కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలీకుండా అతడితో తరచూ కలుస్తూ ఉండేది. ఓ రోజు భర్తకు విషయం తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. తన భార్యతో మాట్లాడొద్దని శేఖర్‌ను కూడా హెచ్చరించాడు. అయినా భార్య మాత్రం.. అతడితో అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేది.

ప్రతీకాత్మక చిత్రం

ఈ విషయమై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుండేవి. దీంతో భర్తపై కోపం పెంచుకున్న భార్య.. ప్రియుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకుంది. ఓ రోజు పత్తి చేలో పని ఉంది.. వెళ్దామంటూ భర్తను పిలిచింది. భార్య కుట్ర తెలియని భర్త.. ఆమెతో పాటూ చేలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శేఖర్.. ఒక్కసారిగా వెంకటయ్యపై దాడి చేశాడు. ప్రియుడితో కలిసి భర్తపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement