Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైన్‌ షాపును ఊరి మధ్య నుంచి తొలగించాలి

చిలుకూరు, డిసెంబరు 1: ఊరి మధ్యలో మద్యం దుకాణాన్ని తరలించాలని కోరుతూ బేతవోలు గ్రామస్థులు మద్యం దుకాణం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో గ్రామం మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. మద్యం ప్రియులతో మహిళలు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నందున మద్యం దుకాణాన్ని తరలించాలని కోరా రు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. మద్యం దుకాణాన్ని తరలించే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించడంతో కోదాడ రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ నాగభూషణరావులు ధర్నా స్థలానికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పినా ఆందోళన విరమణకు అంగీకరించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లారు. మద్యం దుకాణాన్ని తరలించే వరకూ ఆందోళన చేస్తామని గ్రామస్థులు తెలిపారు. ధర్నాలో టీఆర్‌ఎస్‌ నాయకులు వట్టికూటి నాగయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు. 

అన్నారంలోనే వైన్స్‌షాపును కొనసాగించాలి : సర్పంచ్‌లు 

పెన్‌పహాడ్‌: అన్నారంబ్రిడ్జి గ్రామంలో నూతనంగా మంజూరైన మద్యం దుకాణాన్ని కొనసాగించాలని పలు గ్రామాల సర్పంచ్‌లు అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివా్‌సలను  కోరారు. ఈ మేరకు వారికి బుధవారం వినతిపత్రం అందజేవారు. మండల కేంద్రంలో పదేళ్లుగా రెండు మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయని, అదనంగా అన్నారం గ్రామంలో మద్యం దుకాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయితే అన్నారం గ్రామానికి మంజూరైన మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కొన్నేళ్లుగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న వారు మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని కోరారని వారు తెలిపారు. నూతన మద్యం దుకాణంలో ఎమార్పీకే  మద్యం విక్రయించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాగులపాటి అన్నారం, అన్నారం బ్రిడ్జి, నారాయణగూడెం, నాగులపహాడ్‌, దోసపహాడ్‌, పోట్లపహాడ్‌ గ్రామాల సర్పంచులు  కోటమ్మ, రమణమ్మ, మల్లయ్య, లక్ష్మి, సుధాకర్‌, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement