Viral Video: ఇదేం పని తల్లీ.. రంపాన్ని ప్యాంటులో దోపుకోవాలని ప్రయత్నించిన యువతి.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-10T01:04:06+05:30 IST

దొంగలు తెలివిమీరారు. పైకేమే హుందాగా కనిపిస్తారు.. ఎక్కడా అనుమానం రాకుండా తమ పని తాము చేసుకుని వెళ్తారు. కొన్ని దొంగతనాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరికొన్ని చాలా సిల్లీగా ఉంటాయి.

Viral Video: ఇదేం పని తల్లీ.. రంపాన్ని ప్యాంటులో దోపుకోవాలని ప్రయత్నించిన యువతి.. ఆ తర్వాత..

దొంగలు తెలివిమీరారు. పైకేమే హుందాగా కనిపిస్తారు.. ఎక్కడా అనుమానం రాకుండా తమ పని తాము చేసుకుని వెళ్తారు. కొన్ని దొంగతనాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరికొన్ని చాలా సిల్లీగా ఉంటాయి. అలాంటప్పుడు వారిని చూస్తే కోపంతో పాటూ నవ్వు కూడా వస్తూ ఉంటుంది. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఇలాంటి చోరీలు చాలానే బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి నవ్వు తెచ్చించే చోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఓ మహిళ.. ఏకంగా ఎలక్ట్రిక్ రంపాన్నే ప్యాంటులో దోపుకొంది. దాని ఎత్తుకెళ్లాలని శతవిధాలా ప్రయత్నించింది. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.


ఓ మహిళ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. తనకు కావాల్సినవి తీసుకున్నట్లు నటిస్తూ వస్తువల కోసం వెతకసాగింది. పక్కన ఎవరూ లేని సమయంలో చోరీకి ప్లాన్ వేసింది. అక్కడే ఓ ఎలక్ట్రిక్ రంపం కనిపించింది. ఇంకేముందీ.. ఇదే కదా సమయం అనుకుని దాన్ని ప్యాంటులో దోపుకోవాలని చూసింది. ముందువైపు దాచుకోవాలని చూసినా కుదరలేదు. దీంతో కొద్దిసేపు ఆలోచించి మళ్లీ రంపాన్ని తీసుకుని వెనుకవైపు దోపుకోంది. పైకి కనబడకుండా బ్యాగులను అడ్డు పెట్టుకుని దర్జాగా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లింది. తనను ఎవరూ చూడలేదులే అనుకుంది. కానీ పైన ఉన్న సీసీ కెమెరా.. తన పని తాను చేసింది. ఏ ప్రాంతంలో జరిగిందో తెలీదుగానీ.. ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఇదెక్కడి చోరీరా నాయనా.. అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. 

Updated Date - 2021-11-10T01:04:06+05:30 IST