ప్రత్యేకంగా కలుసుకుందామంటూ మహిళ నంచి మెసేజ్.. తీరా అక్కడికి వెళ్లిన వ్యక్తికి అనుకోని షాక్..

ABN , First Publish Date - 2021-11-07T22:58:24+05:30 IST

బెంగళూరులో ఓ వ్యక్తికి వాట్సాప్‌లో మహిళ పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకునేవారు. ఓ రోజు ప్రత్యేకంగా కలుసుకుందామంటూ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. ఆమెను కలుసుకోవాలని అక్కడికి వెళ్లిన వ్యక్తికి అనుకోని షాక్ తగిలింది.

ప్రత్యేకంగా కలుసుకుందామంటూ మహిళ నంచి మెసేజ్.. తీరా అక్కడికి వెళ్లిన వ్యక్తికి అనుకోని షాక్..

ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడిడెక్కడి వారో పరిచయం అవుతుంటారు. మగ, ఆడవారి మధ్య ఏర్పడే పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్తుంటే.. మరికొన్ని ఘటనల్లో వికటించి, మొదటికే మోసం జరుగుతూ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తికి వాట్సాప్‌లో మహిళ పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకునేవారు. ఓ రోజు ప్రత్యేకంగా కలుసుకుందామంటూ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. ఆమెను కలుసుకోవాలని అక్కడికి వెళ్లిన వ్యక్తికి అనుకోని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..


బెంగళూరు గోవిందపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న 50 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో ఓ మహిళతో పరిచయమైంది. రెండేళ్లుగా ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో మరింత ఎక్కువగా చాటింగ్ చేసుకునేవారు. ఓ రోజు అనుకోకుండా మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. అక్టోబరు 8న కలుసుకుందామంటూ మెసేజ్ చేసింది. నగరంలోని ఓ హోటల్‌లో కలుసుకుందామని ఇద్దరూ అనుకున్నారు. అనంతరం ఆమెను కలిసేందుకు వెళ్తే.. అక్కడ మహిళ కాకుండా ముగ్గురు వ్యక్తులు ఉండడం చూసి షాక్ అయ్యాడు.


తాము పోలీసులమంటూ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి బెదిరించారు. తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డులు, పర్సు తీసుకున్నారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న వ్యక్తి.. బ్యాంక్ ఖాతా చూసుకుని షాక్ అయ్యాడు. తన ఖాతాలో రూ.3.91,812ల నగదు మాయమైంది. ఆ నగదు ఐదు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మరో రూ.2 లక్షలు డ్రా అయినట్లు బాధితుడికి మెసేజ్ వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-11-07T22:58:24+05:30 IST