Abn logo
Sep 21 2021 @ 00:21AM

పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి

ర్యాలీగా వస్తున్న పంచాయతీ కార్యదర్శులు

టీఎ్‌సపీఎస్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌ 


నల్లగొండ టౌన్‌, సెప్టెంబరు 20: పంచాయతీ కార్యదర్శులపై పనిభా రం తగ్గించాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌ డిమాండ్‌ చేశారు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానం ద్వారా అదనపు భారం మోపడం సమంజసం కాదన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఏ ఉద్యోగికి లేని పనివేళలను అమలు చేయడాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామస్థాయిలో సరైన సిబ్బందిలేక ఇప్పటికే తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అన్ని పనులకు తమ ను బాధ్యులను చేయడం సరికాదన్నారు. అంతకుముందు స్థానిక మేకల అభినవ్‌ స్టేడియం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మకు వినతిపత్రం అందజేశారు.