వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-01-24T04:35:25+05:30 IST

రాష్ట్రంలో దుర్మార్గపు, దౌర్జన్య పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ చరమగీతం పాడాలని టీడీపీ తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి
భోజనం వడ్డిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి

టీడీపీ తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు 

నంద్యాల టౌన్‌, జనవరి 23: రాష్ట్రంలో దుర్మార్గపు, దౌర్జన్య పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ చరమగీతం పాడాలని టీడీపీ తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల మండలం కానాల గ్రామంలో టీడీపీ నాయకుడు, న్యాయవాది బాబు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్పాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారన్నారు. టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తనతండ్రి చంద్రబాబు అడుగుజాడల్లో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కానాల మాజీ సర్పంచ్‌ పీడీ హుసేన్‌, మాజీ ఎంపీటీసీ మదర్‌, నాయకులు బాల మద్దిలేటి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 

- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ ఫలాలు అందించారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ లోకేష్‌ దేశ, విదేశీ సాప్ట్‌వేర్‌ కంపెనీలను తెచ్చి ఉద్యోగావ కాశాలు కల్పించారని తెలిపారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడి లోకేష్‌ ఆధ్వర్యంలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్క కార్యకర్త ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. ఈ కార్య్రకమంలో కౌన్సిలర్‌ మాబువలి, టీడీపీ నాయకులు మారం వినయ్‌, మాజీ కౌన్సిలర్లు ముడియం కొండారెడ్డి, మంచాల విజయభాస్క ర్‌రెడ్డి పాల్గొన్నారు. 

- నంద్యాల పార్లమెంట్‌ తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్‌ ఆధ్వర్యంలో నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకాన్ని లోకేష్‌ అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో శేఖర్‌, ప్రసాద్‌, బాషా, కళ్యాణ్‌, రాము పాల్గొన్నారు. 

చాగలమర్రి: టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమ తుందని చాగలమర్రి మాజీ సర్పంచ్‌ అన్సర్‌ బాషా, తెలుగు నాడు కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ యువత కార్యదర్శి కొమిసోను తెలిపారు. ఆదివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ సెంటర్‌లో కేక్‌ కట్‌ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణగౌడ్‌, కొలిమి ఉసేన్‌వలి, సల్లా నాగరా జు, రఫిద్దిన్‌, మాబులాల్‌, భాస్కర్‌రెడ్డి, జెట్టి సుధాకర్‌, బషీర్‌ పాల్గొన్నారు. 

ఆళ్లగడ్డ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. పట్టణంలోని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటిలో ఆదివారం కేక్‌ కట్‌ చేసి లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, చాంద్‌బాషా, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:35:25+05:30 IST