Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ ఆశయాలకు విరుద్ధంగా వైసీపీ పాలన

అనంతపురంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించి వినతి పత్రం అందజేస్తున్న ప్రభాకరచౌదరి తదితరులు,


- ఓటీఎస్‌ పేరుతో   పేదోళ్లను   వేధించడం  సరికాదు

- మాజీ ఎమ్మెల్యే   ప్రభాకరచౌదరి

- అంబేడ్కర్‌కు   వినతి ఇచ్చి   ఘన నివాళి

అనంతపురం వైద్యం, డిసెంబరు6: రాష్ట్రంలో అంబేడ్కర్‌ ఆశ యాలకు విరుద్ధంగా వైసీపీ ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి మండి పడ్డారు. ఓటీఎస్‌ వసూళ్ళ దోపిడీని ఆపాలంటూ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం ని యోజక వర్గ శ్రేణులతో కలిసి ఆయన అంబేడ్కర్‌ నగరంలోని విగ్రహం వద్ద నిరసన తెలిపి, వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగ నిర్మాత అం బేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా తమ్ముళ్లు అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. అనంతరం ప్రభాకరచౌదరి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు సైతం ఇతర వర్గాలతో పాటు సమాజంలో బతకాలని అంబేడ్కర్‌ రచిం చిన రాజ్యాంగ స్ఫూర్తితో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆ పే ద వర్గాలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అందరికీ కూడు, గూడు, గుడ్డ అందించేందుకు చర్యలు చేపట్టారన్నారు.  ఇందులో భాగంగా వారికి ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఆ తర్వాత వ చ్చిన సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సైతం పేదల ఇళ్లకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అయితే ప్రస్తుత సీఎం జగనమోహనరెడ్డి అం దుకు విరుద్ధంగా ఎప్పుడో కట్టిచ్చిన ఇళ్లకు ఇప్పుడు రిజిసే్ట్రషన పేరుతో వేలకువేల రూపాయల వసూళ్ల దోపిడీకి దిగడం దుర్మార్గమన్నారు.  ఓటీఎస్‌ పేరుతో డబ్బులు చెల్లించాలని బెదరింపులకు దిగడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకొనేలా చూడాలని అంబేడ్కర్‌కు విన్నివించుకున్నట్లు చౌదరి తెలిపారు. వైసీపీ పాలకులు పునరాలోచించాలని లేకపోతే ఆ పేదల ఉసురు తగులుతుం దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆది నారాయణ, దేవళ్ల మురళి, నాయకులు, సరిపూటి రమణ, డిష్‌నాగరాజు, వెంకటేష్‌గౌడ్‌, మారుతిగౌడ్‌, గుర్రం నాగభూషణ, సుధాకరయాదవ్‌, గోపాల్‌గౌడ్‌,  ముక్తియార్‌, బంగినాగ, బోరంపల్లి ఆంజేనేయులు, నరసిం హులు, బీటెక్‌ దాదు, కాకర్లఆదినారాయణ, శ్రీనివాస్‌చౌదరి, రామకృష్ణ, పూలబాషా, మహిళా నాయకురాళ్ళు మనెమ్మ, హసీనా, వసుంధర, నాగమ్మతో  పాటు పెద్దఎత్తున టీడీపీ  నాయకులు పాల్గొన్నారు. 

శింగనమల : ఓటీఎస్‌ పథకం ఒత్తిళ్లతో ప్రభుత్వం నిరుపేదల ప్రాణా లతో  చెలగాటమాడుతోందని టీడీపీ శింగనమల నాయకులు డేగల కృ ష్ణమూర్తి, దండు శ్రీనివాసులు, మారుతి నాయుడు పేర్కొన్నారు. ఓటీ ఎస్‌ పథకం రద్దు చేయాలంటూ అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా వారు సోమవారం శింగనమలలో  ఆయన విగ్రహా నికి పూలమాలలు వేసి ని వాళి అర్పించి, వినతి పత్రం అందజేశారు. పార్టీ అనంతపురం పార్లమెం టు కోశాధికారి ఈడిగ శ్రీనివాసులు, మండల కన్వీనర్లు బాలరంగయ్య, ఎర్నాగప్ప, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరనాయుడు, విజ య్‌, దాసరి గంగాధర్‌, నాగముని, వెం కటేష్‌, కుళ్లాయప్ప, మాసూల చంద్రమోహన, తిప్పన్న, దండు విజ య్‌, సాకే అనిల్‌, నాగేంద్ర, సు దర్శన, నారాయణస్వామి, ఆది, సురేష్‌, కేసీ నాయుడు, వెంకటరా ము డు, సుంకన్న, చండ్రాయుడు, పవన, రాజు బాబు, రఘురాం, నాగరాజు, పెద్దన్న, సుదర్శన, రామాంజి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు : ప్రభుత్వం నిరు పేదల నుంచి ఓటీఎస్‌ పథకం పేరుతో చేపట్టిన డబ్బు వసూలు కార్యక్రమాన్ని రద్దు చేయాలని టీడీపీ మండల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, మండల కన్వీనర్‌ సూరి, మండల  నాయకులు పిల్లల ప్రతాప్‌, గంతి శ్రీనివాసులు, రాజా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నేకొత్తపల్లి:  అంబేడ్కర్‌ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం నీరు గారు స్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్రశాఖ సూచనల మే రకు... వారు సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం  ఓటీఎస్‌ పథకాన్ని రద్దుచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి, తెలుగు మహిళా పార్లమెంట్‌ ఉపా ధ్యక్షురాలు రామసుబ్బమ్మ, నాయకులు శ్రీరాములు, చందమూరు విజయ్‌, అంకేఅమరేంద్ర, యజ్జేశంకర్‌, శివ, ఏపీశ్రీనివాసులు, బార్గవ గౌడ్‌, రమేశ, ముత్యాలు, సావిత్రి, బెస్తనాగార్జున శివన్న తదితరులు పాల్గొన్నారు. 

రామగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌ పథకాన్ని రద్దుచే యాలని టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ముందుగా మండలకేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుబ్బరాయుడు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పోతన్న,  మాజీసర్పంచ శ్రీనివాసులు, ఎంపీటీసీ శ్రీనివా సులు, హెచముత్యాలు, మండల ప్రధానకార్యదర్శి పేపర్‌శీన, తెలుగుయువతనాయకులు లింగాశ్రీధర్‌నాయుడు, అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement