Abn logo
Apr 19 2021 @ 00:35AM

గుంతలో పడి యువకుడి మృతి

నడిగూడెం, ఏప్రిల్‌ 18: బంధువుల ఇంటో జరిగే శుభకార్యానికి వ చ్చిన యువకుడు రోడ్డు పక్కన గుంతలో పడి మృతిచెందాడు. ఈ ఘ టన మండలంలోని వేణుగోపాలపురంలో ఆదివారం జరిగింది. పోలీసు లు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం కా సాయిగూడేనికి చెందిన రెడ్డబోయిన సాయి(22) నడిగూడెం మం డలం వేణుగోపాలపురంలోని తమ బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వచ్చాడు. ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్నగుంతలో పడిపోయాడు. ఊరికి దూరంలో సంఘటన జరగడంతో గుంతలో పడి తీవ్ర గాయాలైన సాయిని ఎవరూ గమనించ లేదు. పొలం పనులు ముగించుకొని సాయంత్రం వస్తున్న రైతులు గుంతలో బైక్‌ పడి ఉండడాన్ని గమనించారు. దగ్డరికి వెళ్లి చూడగా గాయాలతో యువకుడు గుంతలో పడి ఉన్నాడు. ఆ యువకుడిని గుంతలోకి బయటికి తీసి, 108లో చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాయి మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement