Abn logo
Sep 25 2021 @ 16:05PM

ప్రేయసిపై ఓ వ్యక్తి అత్యాచారం.. విషయం తెలిసి ప్రియుడి షాకింగ్ నిర్ణయం.. రెండు పేజీల లెటర్ రాసి..

వారిద్దరూ 16 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా గడపాలని కలలు కన్నారు. ఎంతో ఆనందంగా గడుస్తున్న వారి జీవితంలో పెను తుఫాను చెలరేగింది. ప్రియసిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు పేజీల లేఖ రాసి.. ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకెళ్తే..


హర్యానాలోని హిసార్ జిల్లా బద్దోపట్టి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సత్యప్రకాష్ అలియాస్ సోను.. షికార్పూర్ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ ప్రేమజంట గురించి తెలిసి సునిల్ అనే ప్రభుత్వోద్యోగి వాళ్లను వేధించడం ప్రారంభించాడు. అతడకి పెళ్లయి, ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. సోనుని సునిల్ బ్లాక్ మెయిల్ చేస్తూ చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా అతడి ప్రేయసిని హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం తెలిసి అతడు తట్టుకోలేకపోయాడు. రెండుపేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.


సూసైడ్‌ నోట్‌లో బాధితుడు ఏం రాశాడంటే..

‘‘నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎంతో సంతోషంగా ఉన్న మా ప్రేమజంట మధ్యలోకి సునిల్ వచ్చాడు. అతడు నన్ను చంపేస్తానని బెదిరించాడు. నా ప్రియురాలిని బలవంతంగా హోటల్‌కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె కుటుంబసభ్యులకు, నాకు ప్రాణహాని ఉంది. భయంతో సునిల్ చెప్పిన మాటలన్నింటికీ నా ప్రేయసి అంగీకరించింది. రెండు నెలల నుంచి ఆమె మానసిక క్షోభ అనుభవిస్తుంది. 


దీనికి సంబంధించిన ఆధారాలన్నీ నా వాట్సాప్‌లో ఉన్నాయి. నా ఆత్మహత్యకు కారణమైన సునిల్‌ను కఠినంగా శిక్షించాలి. నేను, నా ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ అతను మా జీవితాలను నాశనం చేశాడు. రెండు నెలలుగా మాకు సరైన తిండి లేదు. ఒక చపాతి తిని రోజులు గడుపుతున్నాం. నేను చనిపోయిన తర్వాత ఆమె బతికున్న శవంలా మారుతుందని నాకు తెలుసు. సునిల్ గురించే కాదు.. ఆమె నా దగ్గర ఏ విషయాన్ని దాచకుండా అన్ని విషయాలు చెప్పేది. నా చావుకు కారణమైన సునిల్ వీలైనంత త్వరగా శిక్షించాలని పోలీసులను కోరుకుంటున్నాను. మరే జంట ఇలాంటి వ్యక్తులకు బలికాకూడదు’’ అని సూసైడ్ నోట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. 


చివరగా ‘‘ఎంతో భవిష్యత్తు ఉన్న నేను.. అతడు చేసిన చెడు పనుల వల్ల ఇలా మధ్యలోనే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. సునిల్ మా కలల్ని చిన్నాభిన్నం చేసి, నా చావుకు కారణమయ్యాడు’’ అని వాపోయాడు.

ప్రత్యేకంమరిన్ని...