Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లయిన మహిళలకు వల.. భర్తలకు తెలీకుండా యువకుడితో రాసలీలలు.. ఊరి పెద్దాయనకు తెలియడంతో..

బీటెక్ చదువుతున్న కుర్రాడికి చదువు మీద ధ్యాస లేదు. రోజూ నీలిచిత్రాలను చూడటం మొదలెట్టాడు. ఎలాగైనా కామవాంఛ తీర్చుకోవాలని గ్రామంలోని పెళ్లయిన మహిళలకు వల వేశాడు. వారు కూడా ఇతన్ని నమ్మి.. భర్తలకు తెలీకుండా రోజూ కలిసేవారు. ఈ విషయం గ్రామ పెద్దాయనకు తెలియడంతో యువకుడిని మందలించాడు. తర్వాత జరిగిన పరిణామాలు తెలుసుకుని గ్రామస్తులంతా షాక్ అయ్యారు..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక పరిధి కోలార్ బెతమంగ తాలూకాలో అభిషేక్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుని ఉద్యోగం సాధించాలనే తపన అతడిలో కొంచెం కూడా లేదు. రోజూ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ కాలం గడిపేవాడు. ఇలా అతనిలో కామవాంఛ పెరిగిపోయింది. ఎలాగైనా ప్రత్యక్షంగా అనుభూతి పొందాలని ప్రయత్నించేవాడు. ఈ పిచ్చిలో పడి చదువును పూర్తిగా పక్కన పెట్టేశాడు. రోజూ గ్రామంలోని పెళ్లయిన మహిళలతో చనువుగా ఉండేవాడు. రాను రాను వారితో అక్రమ సంబంధం కొనసాగించేవాడు. ఇలా చాలా మంది మహిళతో శారీరకంగా కలిసేవాడు. భర్తలు బయటికి వెళ్లగానే మహిళలు కూడా అతడికి ఫోన్లు చేసి పిలిచేవారు. ఇలా సాగుతుండగా ఓ మహిళ భర్తకు అనుమానం వచ్చి.. ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో అక్టోబర్‌లో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

నిందితుడు అభిషేక్, మృతుడు నారాయణ స్వామి

అభిషేక్ కారణంగానే ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందనే విషయం గ్రామ పెద్ద నారాయణ స్వామి తెలుసుకున్నాడు. యువకుడిని ఇంటికి పిలిపించి మందలించాడు. ఇంకోసారి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవద్దంటూ గట్టిగా బుద్ధి చెప్పాడు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిన యువకుడు.. గ్రామ పెద్దపై పగ పెంచుకున్నాడు. మిగతా మహిళలతో సంబంధాన్ని ఎక్కడ చెడగొడతాడో అనుకుని కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 2న నారాయణస్వామి బైక్‌పై వెళ్తుండగా.. మధ్యలో బండిని ఆపి, అతడిపై దాడి చేశాడు. తలను, మొండాన్ని వేరు చేసి కాలువలో పడేసి వెళ్లిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర సంచలనం కలిగించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement