Abn logo
Sep 24 2021 @ 09:36AM

యువతి మృతదేహాన్ని.. నగ్నంగా దుప్పట్లో చుట్టి..

హైదరాబాద్: యువతి మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం.. నగర శివారులోని హయత్‌నగర్ బాతుల చెరువు సమీపంలో వెలుగుచూసింది. ఇద్దరు యువకులు కలిసి గురువారం రాత్రి యువతి మృతదేహాన్ని దప్పట్లో చుట్టి గుట్టుగా తరలిస్తున్నారు. బాతుల చెరువు సమీపంలో వారిని స్థానికులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి ఇద్దరినీ నిలదీశారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు వారిని ప్రశ్నించడంతో.. ఆ యువతి తన భార్య అని, తమది ప్రేమ వివాహమని.. ఇద్దరిలో ఒక యువకుడైన వినోద్ చెప్పుకొచ్చాడు. గత 20 రోజుల నుంచి తనకు అనారోగ్యంగా ఉందని, ఈ క్రమంలో రాత్రి మృతి చెందిందని చెప్పాడు. అంత్యక్రియలు చేసేందుకు తనకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో బయటికి తీసుకెళ్లి ఖననం చేయాలని వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే మహిళను నగ్నంగా తరలించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి..  సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. వారిద్దరు కలిసి ఆమెను హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption