Abn logo
Sep 26 2021 @ 23:57PM

యువత రాజకీయాల్లోకి రావాలి

సభలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట

కొత్తపట్నంలో ముగిసిన శిక్షణ తరగతులు

కొత్తపట్నం (ఒంగోలు నగరం), సెప్టెంబరు 26 : యువత మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని రాజకీయాల్లోకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ట పిలుపునిచ్చారు. కొత్తపట్నంలో ఐదు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతుల   ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకులు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నదని ధ్వజమెత్తారు.  రైతలకు చేటు తెచ్చే చట్టాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ సోమవారం నిర్వహిస్తున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. రైతులకు అండగా విద్యార్ధి, యువజనులు నిలవాలన్నారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు రావులపల్లి రవీంథ్రనాథ్‌, రావుల వెంకయ్య, ఏఐవైఎఫ్‌ నాయకులు లెనిన్‌, రాజేంద్ర, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.