Abn logo
Sep 25 2021 @ 00:13AM

సమాజంలోని రుగ్మతలపై యువత పోరాడాలి

మాట్లాడుతున్న సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు

కొత్తపట్నం(ఒంగోలునగరం), సెప్టెంబరు 24: యువత క్రమశిక్షణ, మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు పోరాటం చేయాలని పలువురు వ్యక్తలు పిలుపునిచ్చారు. కొత్తపట్నంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్‌లో భాగంగా శుక్రవారం  సభకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఏఐవైఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అవినితి, నిరుద్యోగం పెరిగిపోయిందని, వాటిని అరికట్టే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయటం లేదని విమర్శించారు. అనంతరం  టి.వెంకటేశ్వరరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, సినీదర్శకులు బాజ్జి, జేవీవీ నాయకుడు కొల్లా నాగేశ్వరరావు ప్రసంగించారు. ప్రజానాట్యమండలి గాయకుల కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ, నాయకుడు ఆర్‌.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.