యువత లక్ష్యానికి అనుగుణంగా సాధన చేయాలి

ABN , First Publish Date - 2021-01-18T05:01:10+05:30 IST

యువత లక్ష్యానికి అనుగుణం గా సాఽధన చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

యువత లక్ష్యానికి అనుగుణంగా సాధన చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి టౌన్‌, జనవరి 17: యువత లక్ష్యానికి అనుగుణం గా సాఽధన చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవీఎస్‌ గార్డెన్‌లో ఏర్పా టు చేసిన ఆర్మీ, పోలీసు ఉద్యోగాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాశ్రేయస్సు కోసం ఎంచుకునే ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువత లక్ష్యానికి అను గుణంగా సాఽధన చేసినప్పుడే విజయతీరాలకు చేరుతారని అన్నారు. సైన్యంలో పనిచేస్తూ దేశరక్షణకు పాటుబడే వారితో పాటు పోలీసు ఉద్యోగాలు చేస్తూ ప్రజారక్షణకు తమ ప్రాణాల ను అడ్డుపెట్టే వారి పట్ల ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంటుందని తెలిపారు. అట్లాంటి ఉద్యోగాలను ఎంచుకుని యువత ముందు కు పోవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. ఎత్తుతో పాటు పొడవుగా ఉన్నవారు మాత్రమే ఆర్మీలో చేరుతారని కొం దరు అవగాహన లేమితో ఉంటారని అన్నారు. కోస్టు గార్డు లాం టి ఉద్యోగాలలో సైతం బక్కచిక్కిన, ఎత్తు తక్కువగా ఉన్నవారు సైతం పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ఆర్మీ, పోలీసు ఉద్యోగాలపై ఉన్న అపోహలను దూరం చేసేందు కు కామారెడ్డిలో రిటైర్డ్‌ కల్నల్‌ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఈ తరహ అవగాహన కార్యక్రమం నిర్వహించడం హర్షించదగిన విషయమని అన్నారు. మార్చిలో జరగబోయే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌తో పాటు పోలీసు ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పోలీసు బృందం, శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నందున యువత ఈ అవకాశాన్ని ఉప యోగించుకోవాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ గతం లో కామారెడ్డిలోనే శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారి తల్లిదండ్రులను, పలుక్రీడల్లో విజేతలుగా నిలిచిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, కౌన్సిలర్‌లు నిట్టు కృష్ణమోహ న్‌, రాష్ట్రనాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, ఇంద్రాసేనారెడ్డి, పిప్పిరి వెంకటి, ముప్పారపు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:01:10+05:30 IST