Abn logo
Jan 9 2021 @ 23:27PM

దొంగ అరెస్టు

ఖమ్మంక్రైం, జనవరి 9: నగరంలోని ఖానాపురంహవేలి పోలీసులు శనివారం ఓ దొంగను పట్టుకున్నారు. శనివారం వాహనాలు తనిఖీచేస్తుండగా ఏపీ రాష్ట్రం ప్రకాశంజిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన పోతుగంటి పీరయ్య, సిద్దిపేట జిల్లా కరక్కాయలగూడేనికి చెందిన సన్నది ఆంజనేయులు ఇరువురు వేర్వేరు ప్రాంతాలలో అనుమానస్పదంగా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కనబడడంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. రాత్రి సమయంలో ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వారు ఒప్పుకున్నారన్నారు. వీరిని నగర ఏసీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో విచారింంచారు. వారి వద్దనుంచి సుమారు రూ.4లక్షల50 వేల విలువ చేసే బంగారం రికవరి చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. అర్బన్‌ పోలీసులును ఏసీపీ అభినందించారు


Advertisement
Advertisement