ఏటీఎంల వద్ద జూదూగాడి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-03T07:44:23+05:30 IST

ఏటీఎం సెంటర్ల వద్ద తచ్చాడుతూ అమాయకులను బురిడీ కొట్టించి నగదు కాజేసే ఓ యువకుడిని కందుకూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఏటీఎంల వద్ద జూదూగాడి అరెస్టు

కందుకూరు, ఆగస్టు 2: ఏటీఎం సెంటర్ల వద్ద తచ్చాడుతూ అమాయకులను బురిడీ కొట్టించి నగదు కాజేసే ఓ యువకుడిని కందుకూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 9 ఏటీఎం కార్డులు, రూ.16,500 నగదు స్వాధీనం చేసుకు న్నారు. ఒక టీవీ, ఫ్రిజ్‌ తదితర వస్తువులను కూడా సీజ్‌ చేశామన్నారు. డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీటెక్‌ చదువుతూ చెడుమార్గం పట్టి చదువు మానేసిన ముప్పరాజు సురేంద్ర అనే యువకుడు ప్రస్తుతం ఒంగోలులో నివసిస్తున్నాడు. ఈ యువకుడు ఏటీఎం కేంద్రాలకు వచ్చే అమాయకులకు లక్ష్యంగా చేసుకుంటాడు. డబ్బులు డ్రా చేసేందుకు సహాయం చేసినట్లు నటించి వారి ఏటీఎంను మిషనులో రివర్స్‌లో పెట్టి పిన్‌ నంబరు  తెలుసుకుంటాడు. అనంతరం డబ్బులు రావడం లేదని వారిని నమ్మిస్తాడు. తనవద్ద ఉన్న డమ్మీ ఎటిఎం కార్డును వారి చేతిలో పెట్టి పంపింస్తాడు. ఆ తర్వాత నింపాదిగా ఒరిజినల్‌ ఎటిఎంను మిషన్‌లో పెట్టుకుని తెలుసుకున్న పిన్‌నంబరుతో ఎంచక్కా నగదు డ్రా చేసు కుంటాడు. ఈ విధంగా కందుకూరులో కూడా పలు నేరాలకు పాల్పడ్డాడు. జిల్లాలో ఇలా 8 మందిని మోసం చేసినట్లు గురించిన కందుకూరు సీఐ శ్రీరామ్‌, పట్టణ  ఎస్సై తిరుపతిరావులు నిందితుడిని సీసీ ఫుటేజీల  ఆధారంగా ఒంగోలులో పట్టుకుని విచారించి అరెస్టు చేశారు.

Updated Date - 2021-08-03T07:44:23+05:30 IST