రిమ్స్‌ ఆడిటోరియంలో చోరీ

ABN , First Publish Date - 2021-06-14T06:14:22+05:30 IST

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఆవరణంలోని ఆడిటోరియంలో దొంగలు పడి విలువైన సామగ్రిని చోరీ చేసినట్లు రిమ్స్‌ సీఐ సత్యబాబు తెలిపారు. రెండు సంవత్సరాలుగా రిమ్స్‌ ఆడిటోరియంలో లాక్‌డౌన కారణంగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో

రిమ్స్‌ ఆడిటోరియంలో చోరీ
ఆడిటోరియంలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు

ఫొటో

రూ.16 లక్షల మేర విద్యుత సామగ్రి అపహరణ

కేసు నమోదు

కడప (క్రైం), జూన 13: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) ఆవరణంలోని ఆడిటోరియంలో దొంగలు పడి విలువైన సామగ్రిని చోరీ చేసినట్లు రిమ్స్‌ సీఐ సత్యబాబు తెలిపారు. రెండు సంవత్సరాలుగా రిమ్స్‌ ఆడిటోరియంలో లాక్‌డౌన కారణంగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఆసుపత్రిలోని సిబ్బంది ఆడిటోరియం పర్యవేక్షణ నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆడిటోరియంలోని సెంట్రల్‌ ఏసీలతో పాటు ఫ్యాన్లు, విద్యుత లైట్లతో పాటు విలువైన సామగ్రిని అపహరించారు. వీటి విలువ మొత్తం రూ.16 లక్షలు ఉంటుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, విద్యుత సామగ్రి మాయంపై సిబ్బందిపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఆడిటోరియం పర్యవేక్షణలో పనిచేసిన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుని ఈ మేరకు విచారిస్తున్నారు. రిమ్స్‌ ఆడిటోరియంలో విలువైన వస్తువులు పోవడంపై ఇంటి దొంగ పనా లేక బయటి వ్యక్తులా అన్న విషయం పోలీసుల విచారణలో తేలనుంది. ఈ మేరకు ఆదివారం సీఐ సత్యబాబు, ఎస్‌ఐ మోహనలు సంఘటనాస్థలానికి చేరుకుని ఆడిటోరియంను పరిశీలించి వివరాలు సేకరించారు. 

Updated Date - 2021-06-14T06:14:22+05:30 IST