వెండి వస్తువులు స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-23T05:51:39+05:30 IST

రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పరిధిలో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. కేసుల వివరాలను సెం ట్రల్‌ జోన్‌ డీఎస్పీ సంతోష్‌కుమార్‌ శనివారం వెల్లడించారు. ఈనెల 17న రాజమహేంద్రవరం నర్శిపల్లి వారి వీధిలో దినేష్‌ అనూప్‌ ఇంట్లో దొంగలు పడి వెండి వస్తువులు అపహరించుకుపోయారు.

వెండి వస్తువులు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సంతోష్‌కుమార్‌

  • హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు
  • డీఎస్పీ సంతోష్‌కుమార్‌

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 22: రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పరిధిలో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. కేసుల వివరాలను సెం ట్రల్‌ జోన్‌ డీఎస్పీ సంతోష్‌కుమార్‌ శనివారం వెల్లడించారు. ఈనెల 17న రాజమహేంద్రవరం నర్శిపల్లి వారి వీధిలో దినేష్‌ అనూప్‌ ఇంట్లో దొంగలు పడి వెండి వస్తువులు అపహరించుకుపోయారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ గోవిందరాజు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పాత నేరస్థుడు స్థానిక అన్నపూర్ణంపేటకు చెందిన గొలగాని శ్రీనివాసరావు అలియాస్‌ శ్రీనును ఈ నెల 21న హైదరాబాద్‌ కృష్ణనగర్‌ యూసఫ్‌ గూడలో అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. శ్రీను నుంచి 7181 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శ్రీను పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. అలాగే ఈనెల 21 దానవాయిపేట అన్నపూర్ణ మెస్‌ వద్ద  స్కూటీలో పెట్టిన రూ.8 లక్షల నగదును ఇద్దరు దొంగలు అపహరించుకుపోయే ప్రయత్నం చేశారని  బాధితుడు కోసూరి రామ్‌సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఓ నిందితుడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పిల్లకాలువ గట్టు రుస్తుంబాదాకు చెందిన కొత్తపల్లి నరేష్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2022-01-23T05:51:39+05:30 IST