చేయని తప్పుకు శిక్షించారు..

ABN , First Publish Date - 2021-01-21T06:48:29+05:30 IST

చేయని తప్పునకు దొంగతనం నేరం మోప డమే కాకుండా పోలీసు కేసు పెట్టించి తన కొడుకును తీవ్రంగా కొట్టిం చారని ఏజెన్సీలోని కూనవరం మండలం పూసిగూడెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ కొమరం వెంకమ్మ ఆరోపించింది.

చేయని తప్పుకు శిక్షించారు..

కూనవరం, జనవరి 20: చేయని తప్పునకు దొంగతనం నేరం మోప డమే కాకుండా పోలీసు కేసు పెట్టించి తన కొడుకును తీవ్రంగా కొట్టిం చారని ఏజెన్సీలోని కూనవరం మండలం పూసిగూడెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ కొమరం వెంకమ్మ ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయం కోసం వలస వచ్చిన గాంధీ అనే రైతు తన ఇంట్లో లక్షా యాభై వేలు నగదు, ఏడు తులాల బంగారు నగలు పోయాయని, వీటిని కొమరం సురేష్‌ మరో వృద్ధుడు దొంగి లించారన్న అనుమానంతో కూనవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు సురేష్‌ను తీసుకువెళ్లి తీవ్రంగా కొట్ట డడంతో సృహ కోల్పోయాడని, తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని తెలిపినా వినలేదని తల్లి తెలిపింది. ప్రస్తుతం తన కొడుకు కూనవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. దీనిపై ఎస్‌ఐ గుణశేఖర్‌ను వివరణ కోరగా సురేష్‌ను విచారణ కోసం స్టేషన్‌కు తీసు కొచ్చామని, అతని ప్రమేయం లేకపోవడడంతో పంపేశామన్నారు.

Updated Date - 2021-01-21T06:48:29+05:30 IST