హథీరాంజీ కాలనీలో చోరీ

ABN , First Publish Date - 2021-10-15T06:38:20+05:30 IST

హథీరాంజీ కాలనీలో చోరీ జరిగింది. ఈ సంఘటన ఏడ్రోజుల తర్వాత వెలుగుచూసింది.

హథీరాంజీ కాలనీలో చోరీ
చిందరవందరగా పడేసిన వస్తువులు

బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల అపహరణ

ఏడ్రోజుల తర్వాత వెలుగులోకి..


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 14: హథీరాంజీ కాలనీలో చోరీ జరిగింది. ఈ సంఘటన ఏడ్రోజుల తర్వాత వెలుగుచూసింది. ఎంఆర్‌పల్లె సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్‌ చంద్రశేఖర్‌ హథీరాంజీ కాలనీలో కాపురం ఉంటున్నాడు. ఈనెల ఏడో తేదీన కుటుంబంతో కలిసి స్వస్థలం కడప జిల్లా కోడూరుకు వెళ్లాడు. తిరిగి బుధవారం రాత్రి ఇంటికి రాగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకెళ్లి చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండటంతో చోరీ జరిగిందని అర్థమైంది. పొద్దుపోయాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదుచేశారు. మొత్తం 20 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు కిలో బరువైన వెండి వస్తువులు చోరీ అయ్యాయని బాధితుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. 

Updated Date - 2021-10-15T06:38:20+05:30 IST