ఇంట్లో చోరీ జరిగిందంటూ కేసు.. పోలీసులు తేల్చిన దొంగ ఎవరో చూసి అవాక్కైన కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2021-08-03T23:10:14+05:30 IST

ఇంట్లో విలువైన వస్తువులు పోవడంతో అతనికి చిర్రెత్తింది. ఇలా చాలాసార్లు జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

ఇంట్లో చోరీ జరిగిందంటూ కేసు.. పోలీసులు తేల్చిన దొంగ ఎవరో చూసి అవాక్కైన కుటుంబ సభ్యులు

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో విలువైన వస్తువులు పోవడంతో అతనికి చిర్రెత్తింది. ఇలా చాలాసార్లు జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని కుటుంబంలోనే ఎవరో దొంగతనానికి సాయం చేశారని అనుమానించారు. చాలా గట్టిగా దర్యాప్తు చేశారు. ఆ సమయంలో దొరికి వేలిముద్రలతో కేసు పెట్టిన వ్యక్తి భార్యే ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అంతేకాదు, ఆమెకు ఈ చోరీలో సొంత అత్తగారు, అంటే కేసు పెట్టిన వ్యక్తి తల్లే సాయం చేసినట్లు తేలడంతో అందరూ షాకైపోయారు. ఈ ఘటన గుజరాత్‌లోని వత్వా ప్రాంతంలో వెలుగు చూసింది.


ఇంట్లో పెట్టిన ఐఫోన్ పోవడంతో ఒక వ్యక్తి.. భార్య రిధ్దిపై అరిచాడు. ఇంట్లో పెట్టిన ఫోన్ ఎలా పోతుందని గొడవపడ్డాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఎంతకీ సమాధానం రాకపోవడంతో అతను పోలీసు కేసు పెట్టాడు. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా దర్యాప్తు చేస్తే షాకింగ్ నిజం బయటపడింది. ఈ దొంగతనం అతని భార్యే చేసింది. ఆమెకు వేరే యువకుడితో ఎఫైర్ ఉంది. అతనికి గిఫ్ట్‌గా ఇవ్వడం కోసమే ఐఫోన్ దొంగిలించింది. ఇప్పటి వరకూ సుమారు రూ.8లక్షల విలువైన వస్తువులు దొంగతనం చేసి ప్రియుడికి చేరవేసిందా ఘనురాలు. ఆమెకు ఈ దొంగతనాల్లో అత్తగారు రోహిణి సహకరించిందని తెలిసి కుటుంబం మొత్తం షాకైపోయారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిద్ధి ప్రియుడికి కూడా ఈ దొంగతనాల్లో హస్తం ఉందేమో తెలుసుకునేందుకు అతన్ని కూడా విచారిస్తున్నారు.

Updated Date - 2021-08-03T23:10:14+05:30 IST