వారి ఓట్లు ఇక్కడే వేయించేస్తాంలే

ABN , First Publish Date - 2021-04-20T08:17:28+05:30 IST

‘‘అంత దూరం నుంచి ఓటర్లను రప్పించడమెందుకు? వారి ఓట్లు ఇక్కడే వేయించేస్తాంలే!’’ అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరొకరితో ఫోన్‌లో సంభాషించిన ఆడియో రికార్డు ఒకటి సామాజిక

వారి ఓట్లు ఇక్కడే వేయించేస్తాంలే

  • 450 మందికి 12 బస్సులు కావాలి
  • పైగా దారి పొడుగునా ఆపుతారు
  • మేనేజ్‌ చేసుకుని వాళ్లవీ మనమే ఎవరో ఒకరితో వేయించొచ్చులే
  • దొంగ ఓటర్లపై చెవిరెడ్డి ఫోన్‌ సంభాషణ
  • సోషల్‌ మీడియాలో వైరల్‌


తిరుపతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘అంత దూరం నుంచి ఓటర్లను రప్పించడమెందుకు? వారి ఓట్లు ఇక్కడే వేయించేస్తాంలే!’’ అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరొకరితో ఫోన్‌లో సంభాషించిన ఆడియో రికార్డు ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి జరిగిన ఈ సంభాషణ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తిరుపతిలో దొంగ ఓటర్ల ప్రమే యం గురించి దీన్ని కూడా ఓ ఆధారంగా చూపుతూ స్థానిక టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ, తిరుపతి రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన చెవిరెడ్డి ఫోన్‌ సంభాషణ వివరాలిలా ఉన్నాయి. ఆ  సంభాషణ యథాతథంగా...(సార్‌...రామ్‌ మాట్లాడతారు అన్న మాటతో సంభాషణ ప్రారంభమైంది)

చెవిరెడ్డి: ఇప్పుడింత రేత్రిలో కష్టం...వచ్చినా టైమ్‌ సరిపోదని మనోళ్ల ఫీలింగ్‌

రామ్‌: అవునా సర్‌...

చెవిరెడ్డి: ఓటింగ్‌ టైమ్‌ సరిపోదు

రామ్‌: అంటే నైన్‌ అవర్సే కదా సర్‌ జర్నీ

చెవిరెడ్డి: లేదు. హడావిడైపోతుంది. 450 మందికి...ఏడు..కాదు 12 బస్సులు కావాలి.

రామ్‌: లేదు..ఫిఫ్టీ మెంబర్స్‌ కెపాసిటీ కదా సర్‌.

చెవిరెడ్డి: అవునయ్యా తొమ్మిది బస్సులు కావాలి. చాలా ఇష్యూస్‌ ఉంటాయి. దారిపొడుగుతా ఆపుతారు.

రామ్‌: అంటే మన టీమ్‌ వస్తున్నారు కద సార్‌. ఎంప్లాయీస్‌, వీళ్లు కో ఆర్డినేట్‌ చేసుకుంటారు.

చెవిరెడ్డి: అది ముందు చూసుకోవల్ల...2 రోజుల ముందనుకొని ఉంటే ప్లాన్‌ చేసుకొని ఉండచ్చు.

రామ్‌: ఆల్‌రెడీ మేమెప్పుడో చెప్పాం సార్‌ ఇది.

చెవిరెడ్డి: నాతో డిస్కస్‌ చేయలేదు ఎవరూ..

రామ్‌: మేం సార్‌ గారికి చెప్పాం...మీకు పంపించమని చెప్పేసరికి మేం....

చెవిరెడ్డి: ఇప్పుడు అందరినీ నిద్ర లేపి.. నాలుగు గంటలకు బయల్దేరిపిచ్చి..

రామ్‌: లేదు సర్‌. ఆల్రెడీ అందరికీ మేం..

చెవిరెడ్డి: వారి ఓట్లు ఇక్కడేసుకుంటాంలే... ఏదోరకంగా మేనేజ్‌ చేసుకుని...వాళ్ల ఓట్లు మనం ఎవరో ఒకరితో వేయించుకునేస్తే సరిపోతుంది...ఎందుకు పాపం వాళ్లకు శ్రమ...మళ్లావచ్చి వెళ్లిపోవల్ల కదా...అంత శ్రమవద్దులే..

రామ్‌: సరే సర్‌..

Updated Date - 2021-04-20T08:17:28+05:30 IST