Abn logo
Feb 23 2021 @ 03:11AM

తెల్లగుండ్లపల్లెలో మహిళారాజ్యం

తవణంపల్లె, ఫిబ్రవరి 22: చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని తెల్లగుండపల్లె పంచాయతీ పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ సర్పంచ్‌ పదవిని మహిళకు రిజర్వు చేయగా.. వార్డు సభ్యులుగానూ మహిళలే విజయం సాధించారు. సర్పంచ్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించగా టీడీపీ మద్దతుతో మాధవి గెలుపొందారు. పంచాయతీలోని 8 వార్డుల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలతోపాటు నలుగురు పురుషులు కూడా పోటీ చేశారు. అయితే అన్ని వార్డుల్లోనూ టీడీపీ మద్దతుదారులైన మహిళలే విజయం సాధించారు. పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎం.వేదవతిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement