దేశంలో కొత్తగా 15,158 కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-01-17T08:03:11+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 2 శాతంగా ఉంది. కేంద్ర

దేశంలో కొత్తగా 15,158 కొవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్‌ కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌  కేసుల సంఖ్య 2 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. శనివారం ఉదయం 8గంటల సమయానికి ముందు 24గంటల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య 15,158గా నమోదైంది. ఇదే సమయంలో 16,977మంది బాధితులు కోలుకోగా.. 175మంది ప్రాణాలు కోల్పోయారు.


దేశవ్యాప్తంగా శనివారం ఉద యానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,42,841గా ఉండగా.. రికవరీ సంఖ్య 1,01,79,715గా ఉంది. దీంతో రికవరీ రేటు 96.56శాతానికి చేరింది. ఇక.. కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 116కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  కాగా.. అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల మహంత (68) ఛాతీ నొప్పితో గువాహతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.  


Updated Date - 2021-01-17T08:03:11+05:30 IST