చైనా కంపెనీలతో కొత్త ఒప్పందాలుండవు

ABN , First Publish Date - 2020-06-19T09:58:24+05:30 IST

సరిహద్దులో చైనా దాష్టీకానికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోం ది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపు కూడా వినిపిస్తోంది. ఈ సందర్భంగా బీసీసీఐ కూడా కీలక

చైనా కంపెనీలతో కొత్త ఒప్పందాలుండవు

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా దాష్టీకానికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోం ది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపు కూడా వినిపిస్తోంది. ఈ సందర్భంగా బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్‌లో చైనాకు చెందిన కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోమని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలకు మించి తమకేదీ ముఖ్యం కాదని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ తేల్చి చెప్పాడు. వాస్తవానికి ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ అయిన వివో (చైనా మొబైల్‌ కంపెనీ) నాలుగేళ్ల ఒప్పందంలో భాగంగా ప్రతీ ఏడాది రూ.440 కోట్లు చెల్లిస్తుంటుంది. ‘భవిష్యత్‌లో కుదుర్చుకునే ఒప్పందాల విషయంలో ప్రజల మనోభావాలు, జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుం టాం. అందుకే చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేసే విషయంలో నిబద్ధతతో ఉన్నాం. మున్ముందు అలాం టి వాటితో ఎలాంటి సంబంధాలు ఉండవు’ అని ధూ మల్‌ తేల్చాడు. మరోవైపు  గత పాలకుల హ యాంలో చైనీస్‌ కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు నిబంధనల మేరకు కొనసాగుతాయన్నాడు.

ఐఓఏ కూడా: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కూడా చైనాకు సంబంధించిన స్పాన్సర్‌షిప్‌ లను నిలిపివేయాలని యోచిస్తున్నట్టు ఐఓఏ కార్య దర్శి రాజీవ్‌ మెహతా చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌ వరకూ తాము లీ-నింగ్‌తో 2018లో ఒప్పందం కుదు   ర్చుకున్నామని, దీనిపై చర్చ జరగాల్సివుందని అన్నారు. కాగా 2020 ఆసియా బీచ్‌గేమ్స్‌, 2022 ఆసియా క్రీడల్లో భారత్‌ పాల్గొనే విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించలేమని అన్నారు.

Updated Date - 2020-06-19T09:58:24+05:30 IST