ఒక్కో వ్రత మండపంలో 20 జంటలకే అవకాశం

ABN , First Publish Date - 2020-06-04T11:04:34+05:30 IST

దాదాపు 80 రోజుల సుదీర్ఘ విరా మం అనంతరం ప్రార్థనా మందిరాలు ఈనెల 8నుంచి తెరుచుకోవచ్చనే కేంద్ర ప్రభుత్వ సడలింపు ..

ఒక్కో వ్రత మండపంలో 20 జంటలకే అవకాశం

అన్నవరం, మే 3: దాదాపు 80 రోజుల సుదీర్ఘ విరా మం అనంతరం ప్రార్థనా మందిరాలు ఈనెల 8నుంచి తెరుచుకోవచ్చనే కేంద్ర ప్రభుత్వ సడలింపు మేరకు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల ప్రవేశానికి సంబంధించి విధివిధానాల కోసం బుధ వారం దేవదాయశాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, దేవదాయ కమిషనర్‌ టెలికాన్ఫరెన్స్‌లో అన్ని ప్రధానా ఆలయాల ఈవోలతో సమీక్ష నిర్వహించగా అన్నవరం ఈవో త్రినాథరావు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఈవో తమ ప్రతిపాదనలను తెలియజేశారు.


అన్నవరం ఆలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసి భక్తులంతా చేతులు శుభ్రపరిచిన తర్వాతనే ఆల యంలోకి ప్రవేశించేవిధంగా చర్యలు తీసుకుంటామని, భక్తుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా మార్కింగ్‌ చేశామని, గర్భాలయ దర్శనాలు నిలిపివేసి కేవలం లఘుదర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయిం చామని తెలిపారు. అలాగే ఒక్కొక్క వ్రత మండపంలో కేవలం 20 జంటలను మాత్రమే కూర్చొబెట్టి వ్రత నిర్వహణ చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి, ఉన్నతాధికారులకు ఈవో తెలియజేశారు. అంతకు ముందు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌  మాట్లాడుతూ ఆలయాలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని, తేదీని త్వరలో రాష్ట్రప్రభుత్వం ప్రకటిస్తుం దని చెప్పారు. ఆలయాలకు సంబంధించి ఆర్థికపర మైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, దాదాపు 40 శాతం ఆదాయం తగ్గే ప్రమాదముందని దానికణుగుణంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవా లని సూచించారు. కాగా ఈనెల 8న ఆలయాలు తెరు స్తారని ప్రచారం జరిగినా రెండు మూడు రోజులు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - 2020-06-04T11:04:34+05:30 IST