అత్యవసర పనులు చేయాలన్నా గ్రాంట్‌ కూడా లేదు

ABN , First Publish Date - 2022-01-20T04:49:16+05:30 IST

గ్రామాల్లో కొన్ని శాఖలకు సంబంధించిన అత్యవసర పనులు చేయాలన్నా ఆదుకునేందుకు ఎమ్మెల్యే గ్రాంట్‌ కూడా లేదని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని రెవెన్యూ కార్యలయంలో తహసీల్దార్‌ సంజీవరావుతో కలిసి ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. చాగొల్లు గ్రామానికి చెందిన రాష్ట్ర వడ్డెర సంఘం నాయకుడు ధర్మరాజు గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం లేక శివారుప్రాంత ప్రజలు చీకట్లలో అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా..ఇలాంటి సమస్యలే అధికంగా ఉన్నాయని, కనీసం అత్యవసరంగానైనా కొంతమేర పనులు చేపడదామంటే మాకు కూడా గ్రాంట్‌లు లేవని వాపోయారు.

అత్యవసర పనులు చేయాలన్నా  గ్రాంట్‌ కూడా లేదు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

ఉలవపాడు, జనవరి 19 : గ్రామాల్లో కొన్ని శాఖలకు సంబంధించిన అత్యవసర పనులు చేయాలన్నా ఆదుకునేందుకు ఎమ్మెల్యే గ్రాంట్‌ కూడా లేదని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని రెవెన్యూ కార్యలయంలో తహసీల్దార్‌ సంజీవరావుతో కలిసి ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. చాగొల్లు గ్రామానికి చెందిన రాష్ట్ర వడ్డెర సంఘం నాయకుడు ధర్మరాజు గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం లేక శివారుప్రాంత ప్రజలు చీకట్లలో అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా..ఇలాంటి సమస్యలే అధికంగా ఉన్నాయని, కనీసం అత్యవసరంగానైనా కొంతమేర పనులు చేపడదామంటే మాకు కూడా గ్రాంట్‌లు లేవని వాపోయారు.  అలాగే మన్నేటికోటలో నిర్మించే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ విషయంలో స్థానికులకు పరిస్థితులు క్షుణంగా చెప్పినప్పటికీ వినిపించుకోలేదని, చివరికి కాలనీవాసులు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండానే కోర్టు నిబంధన ప్రకారం పనులు చేపట్టేదాక తెచ్చుకున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కీలక శాఖల అధిపతుల భర్తీ లేక పనులు ముందుకు సాగడం లేదని రెవెన్యూలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి భూవివాదాలు, సమస్యలు లేని ఉలవపాడు మండలం రెవెన్యూ అధికారులు కూడా పనులు చేయకపోవడం వలనే  ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయన్నారు. అన్ని సక్రంగా ఉన్న భూములను కూడా ఆన్‌లైన్‌ ఎక్కించడానికి నెలలు తరబడి తిప్పుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం స్థానికుల నుంచి అర్జీలను తహసీల్దార్‌ కలిసి పరిష్కరించారు. ఆర్‌ఐ బ్రహ్మయ్య, ఎస్సై టీ త్యాగరాజు, వీఆర్వోలు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-20T04:49:16+05:30 IST