Aug 3 2021 @ 00:26AM

భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది

‘‘ముంబై పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తిగా విశ్వాసం ఉంది’’ అని శిల్పా శెట్టి తెలిపారు. భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌, ఆ తర్వాత పరిణామాలపై తొలిసారి ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన విడుదల చేశారు. శిల్పాశెట్టి మాట్లాడుతూ ‘‘కొన్ని రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. వదంతులు, ఊహాగానాలు... మీడియాతో పాటు శ్రేయోభిలాషులూ ఆరోపణలు చేస్తున్నారు. నన్నే కాదు, నా కుటుంబాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. దీని (రాజ్‌ కుంద్రా అరె్‌స్ట)పై నేనిప్పటివరకూ స్పందించలేదు. స్పందించను కూడా! నా తరఫున అసత్యాలు ప్రచారం చేయకండి. ‘ఎప్పుడూ ఫిర్యాదు చేయకు. ఎప్పుడూ వివరణ ఇవ్వకు’ అనేది నేను పాటించే సిద్ధాంతం’’ అని పేర్కొన్నారు. తీర్పు వచ్చే వరకూ అసత్య కథనాలు వండి వార్చవద్దని శిల్పా శెట్టి కోరారు. అసమగ్ర సమాచారంతో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ‘‘29 ఏళ్ల వృత్తి జీవితంలో నాపై ప్రజలు నమ్మకం ఉంచారు. ఎవర్నీ తలదించుకొనేలా చేయలేదు. నేను చట్టాలను గౌరవించే భారతీయ వ్యక్తిని. దయచేసి చట్టాన్ని తన పని చేసుకోనివ్వండి. అప్పటివరకూ నా కుటుంబ సభ్యుల ప్రైవసీ, హక్కులను గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని శిల్పా శెట్టి తెలియజేశారు.


Bollywoodమరిన్ని...