మహా ప్రభుత్వంలో సమన్వయం లేదు: ఫడ్నవీస్

ABN , First Publish Date - 2021-05-06T23:12:57+05:30 IST

అయితే మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని సుప్రీం రద్దు చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.

మహా ప్రభుత్వంలో సమన్వయం లేదు: ఫడ్నవీస్

నాగ్‌పూర్: మహా వికాస్ అగాడీ ప్రభుత్వంలో సమన్వయం లేదని అందుకే మరాఠా రిజర్వేషన్ బిల్లును కోర్టు నిలిపివేసిందని భారతీయ జనతా పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలోని మరాఠా సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టం చేసింది. రాష్ట్ర అసెంబ్లీకి ఇలాంటి చట్టాలు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది.

ఈ విషయమై గురువారం నాగ్‌పూర్‌లో మీడియాతో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘‘రిజర్వేలషన్లు అవసరమే అని హైకోర్టు చెప్పిన అనంతరం అసెంబ్లీలో చట్టం అయింది. ఇదే కేసు సుప్రీంకోర్టులో తిరగబడింది. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా స్టే విధించండని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. కానీ లాభం లేదు. దీనికంతటికీ ప్రభుత్వమే కారణం. మహా వికాస్ అగాడీ మధ్య సరైన సమన్వయం లేదు. ఈ కేసు వాదించడానికి ఒక్కోసారి లాయర్ కూడా లేరు’’ అని అన్నారు.

అయితే మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని సుప్రీం రద్దు చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.

Updated Date - 2021-05-06T23:12:57+05:30 IST