Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్‌ ప్రవాసీలకు మళ్లీ మొండిచేయి !

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాలలోని తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని గత ఆరేళ్లుగా చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. బడ్జెట్‌లో మళ్లీ మొండిచేయి చూపించింది. గల్ఫ్‌ ప్రవాసీల సంక్షేమానికి కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని చెప్పినా నయా పైసా కేటాయించలేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ సహా టీఆర్‌ఎ్‌సకు ముఖ్య నేతలు ఈసారి బడ్జెట్‌లో గల్ఫ్‌ ప్రవాసీల సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయి. కరోనా, పతనమవుతున్న చమురు ధరలు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీలు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఆదుకుంటుందనుకున్న బడ్జెట్‌ నిరాశను కలిగించింది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement