Abn logo
Sep 23 2020 @ 01:18AM

విద్యుత్తు చట్టంతో తెలంగాణ రైతులకు నష్టం లేదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చట్టంలో సవరణల వల్ల తెలంగాణ రైతులు, గృహ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం ఉండదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ స్పష్టం చేశారు.

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ప్రతిపాదిత సవరణ వల్ల విద్యుత్తు రంగంలో సుస్థిరత పెరుగుతుందని, రైతులతో సహా విద్యుత్తు వినియోగదారులకు సహేతుకమైన ధరలకు నాణ్యమైన విద్యుత్తు అందుతుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement