విత్తన నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2021-10-17T07:04:51+05:30 IST

పప్పుశనగ విత్తననాణ్యతలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని, రైతులకు నాణ్యమైన విత్తనాలను ఖచ్చితమైన తూకాలతో అందిస్తా మని జేడీఏ చంద్రనాయక్‌ పేర్కొ న్నారు

విత్తన నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు

జేడీఏ చంద్రనాయక్‌

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 16: పప్పుశనగ విత్తననాణ్యతలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని, రైతులకు నాణ్యమైన విత్తనాలను ఖచ్చితమైన తూకాలతో అందిస్తా మని జేడీఏ చంద్రనాయక్‌ పేర్కొ న్నారు. శనివారం పట్టణంలోని శ్రీసాయిసీడ్స్‌, విజేత అగ్రిటెక్‌ పప్పుశనగ ప్రాసెసింగ్‌ కేంద్రాలను జిల్లా ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ ధనలక్ష్మీతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో శ్రీ సాయు సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ వారి రికార్డులు సరిగ్గా లేకపోవడంతో 100 క్వింటాళ్ల పప్పుశనగను విక్రయాలు సాగించకుండా నిలుపుదల చేశారు. అదేవిధంగా విత్తనాల నాణ్యత, తూకాలు, రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు నాణ్య మైన విత్తనాలు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదన్నారు. స్థానిక అధికారులు కూడా ఎప్ప టికప్పుడూ ప్రాసెసింగ్‌ను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏడీఏ క్రిష్ణయ్య, ఏఓ చన్నవీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T07:04:51+05:30 IST