బ్రేకింగ్ : ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం కొత్త బిల్లులు లేనట్టే..!

ABN , First Publish Date - 2021-11-22T20:19:24+05:30 IST

మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నాక...

బ్రేకింగ్ : ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం కొత్త బిల్లులు లేనట్టే..!

అమరావతి : మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నాక మరోసారి కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో కొత్త బిల్లులు ఏవీ ప్రవేశపెట్టే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. రాజధానుల విషయమై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. నిపుణుల కమిటీని కూడా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కమిటీ రిపోర్టు తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మరికాసేపట్లో క్లారిటీ రానుంది.


కీలక చర్చ..

ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టి దానిపై నిశితంగా మాట్లాడుతున్నారు. అయితే అధికార వికేంద్రీకరణను సమర్థిస్తున్నట్లే బుగ్గన ప్రసంగం ఉంది. మరికాసేపట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి కీలక ప్రకటనే చేయబోతున్నారు. ఆయన మనసులో ఏముంది..? ఏం ప్రకటన చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



Updated Date - 2021-11-22T20:19:24+05:30 IST